వీటిని తినడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు

Loading...
చర్మ రక్షణకు కేవలం ఫేసు ప్యాకులు, రకరకాల క్రీములు మాత్రమే వాడితే సరిపోదు. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని తినడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు.

బచ్చలి కూర : చర్మంలోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర క్రిములు బయటకు విడుదల కావడం వల్ల మొటిమలు వస్తాయి. బచ్చలికూర వంటి ఆకుకూరల్లో రక్తంలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేసే క్లోరోఫిల్‌ ఉంటుంది. బచ్చలి కూరలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలకు యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

పసుపు: ఇది చర్మం మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగపడుతుంది. సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌ అయిన పసుపును ఏదో ఒక రూపంలో రోజుకు పావు చెంచా చొప్పున తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో రక్తంలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది.

క్యారెట్‌: వీటిల్లో బీటా కెరోటిన్‌ రూపంలో విటమిన్‌-ఎ అధికంగా ఉంటుంది. అది మొటిమలకు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక క్యారెట్‌ అయినా తినడం ద్వారా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.

చేపలు: చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లం అధికంగా లభిస్తుంది. ఇది గుండె, చర్మం వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. చేపల ద్వారా లభించే ప్రొటీన్‌ చర్మంలోని బ్యాక్టీరియాతో పోరాడి చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...