ఎంత వయసొచ్చిన బాగా యంగ్ గా కనపడాలంటే ?

Loading...
కొంతమందికి వయసు ఎంత పెరుగుతున్నా వారు చూడడానికి యువకుల్లాగానే కనబడుతుంటారు. తమకంటే వయసులో చిన్న వారి కంటే శారీరకంగా, మానసికంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. దానికి కారణం వారు చిన్న వయసు నుంచి వ్యాయామం చేయడమేనట. అలా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్లే ఇది సాధ్యమవుతుందట. కేవలం యంగ్‌గా ఉన్నామనే భావనే కాకుండా వారు నిజంగానే యంగ్‌గా ఉంటారట.

ఎక్కువగా రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్లు, చేతుల్లో ఉన్న కండరాలు బలపడతాయట. అలాగే వారి కండర కణాలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయట. కెనడాలోని ఒంటారియోలో గల ‘యూనివర్సిటీ ఆఫ్‌ గ్యుల్ఫ్‌’ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాయామం చేయని వారితో పోల్చుకుంటే చేసే వారి కాళ్ల, చేతుల కండరాలు 25 శాతం బలిష్టంగా ఉంటాయని తేలింది. యుక్త వయసులో ఉన్నప్పుడు అథ్లెట్లైన వారు సులభంగా 80, 90 సంవత్సరాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా గడిపేస్తారట. అలాగే వీరు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ.. వ్యాయామం చేయని యువకుల కంటే శారీరకంగా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారట.
Loading...

Popular Posts