స్వయంతృప్తి తప్పా ?ఒప్పా? ప్రతిసారీ తప్పు చేసిన భావన కలుగుతూ ఉంటుంది. స్వయంతృప్తి వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా?

Loading...
ప్రశ్న: నాకు చిన్నప్పటి నుంచి స్వయంతృప్తి అలవాటు ఉంది. కానీ నాకే ఈ అలవాటు ఉందా? అందరికీ ఉంటుందా? అనే అనుమానం నన్ను వేధిస్తూ ఉంటుంది. స్వయంతృప్తితో భావప్రాప్తి పొందిన ప్రతిసారీ తప్పు చేసిన భావన కలుగుతూ ఉంటుంది. అలాగని ఆ పని చేయకుండా ఉండలేకపోతున్నాను. అసలు స్వయంతృప్తి పొందటం అనేది సహజసిద్ధమైన చర్యేనా? స్వయంతృప్తి వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా?

స్వయంతృప్తి సహజసిద్ధమైన, సాధారమైన చర్య. ప్రతి ఒక్కరూ స్వయంతృప్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్వయంతృప్తి ద్వారానే జీవితంలో మొదటి లైంగిక తృప్తి పొందుతారు. మీరు అనుకుంటున్నట్టు ఈ పని తప్పేమీ కాదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా స్వయంతృప్తి పొందవచ్చు. స్వయంతృప్తి వల్ల శారీరకంగా, మానసికంగా ఎటువంటి అస్వస్థతలూ కలగవు. ఎంత తరచుగా చేసినా ఎటువంటి సమస్యలూ తలెత్తవు. 

అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ సార్లు స్వయంతృప్తి సాధన చేయటం వల్ల మర్మాయవాల్లో కొద్దిగా నొప్పితో కూడిన అసౌకర్యం కలగవచ్చు. కొందరు భాగస్వాములతో స్వయంతృప్తి పొందుతూ ఉంటారు. ఈ పద్ధతి లైంగిక కలయిక కంటే ఎంతో సురక్షితం. ఈ పద్ధతి వల్ల ఒకరి నుంచి మరొకరికి సుఖ వ్యాధులు సోకకుండా ఉంటాయి. అయితే మర్మావయవ స్రావాలు చేతుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సరఫరా జరగకుండా ఉండాలి.

చాలామంది స్వయంతృప్తి గురించి మాట్లాడటానికి సిగ్గు పడుతూ ఉంటారు. కానీ ఈ అలవాటు గురించి జంకవలసిన అవసరం లేదు. ఎంత తరచుగా స్వయంతృప్తి పొందినా ఎటువంటి నష్టమూ జరగదు. లైంగిక కోరికలను అదుపు చేసుకుని ఒత్తిడికి లోనవటం లేదా లైంగిక కోరికలను అదుపు చేసుకోలేక లైంగిక దాడులకు పాల్పడటం కంటే స్వయంతృప్తితో లైంగిక సంతృప్తి పొందటం అన్ని విధాలా క్షేమకరం. అయితే స్వయంతృప్తి అలవాటు వల్ల మీ దైనందిన జీవితం ఇబ్బందికరంగా మారితే తప్పకుండా సెక్సాలజి్‌స్టని సంప్రదించి తగిన సూచనలు తీసుకోండి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...