కడుపులో మంట పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి ఇక జన్మలో కడుపుమంట రాదు

కడుపులో మంట రావడానికి రకరకాల కారణాలున్నాయి. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, సిగరెట్లు అతిగా కాల్చడం, అతిగా మద్యం సేవించడం, రోడ్డు మీద చిరు తిళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినడం వలన, అశుభ్రత.. ఇలా రకరకాల కారణాలున్నాయి. ఎప్పుడో ఓసారి మంటగా ఉంటోంది కదా అని మళ్ళీ అవే అలవాట్లతో మళ్ళీ కడుపులో మంటని కొనితెచ్చుకుంటాం. ఇలా మాటిమాటికి జరిగితే అల్సర్ వస్తుంది, ఒక్కోసారి ఆ అల్సర్ లే కడుపులో క్యాన్సర్ కారణం అవుతుంది.

మరి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ? చాలా సింపుల్

చల్లని నీళ్ళలో కాస్తంత పంచదార కలుపుకొని తాగండి. ఒక్కసారికి మంట తక్కువ కాకపొతే, మరోసారి తాగండి పర్లేదు. అతి సులువైన చిట్కా ఇది.

అల్లం కడుపులో మంట పోగొట్టడానికి ఒక సమర్థవంతమైన సాధనం. చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా నమిలి, కొన్ని నీళ్ళు తాగండి. లేదంటే నీళ్ళని లేదా పాలని మరగబెట్టి, దాంట్లో అల్లం వేసి తాగినా కడుపు మంట దెబ్బకి దూరం అవుతుంది. 

బొప్పాయి కూడా కడుపుమంట తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. చివరగా చాలా అద్భుతమైన చిట్కా ఇది. కొబ్బరి నీళ్ళు తాగండి కడుపులో మంట ఉన్నప్పుడు మాత్రమే కాదు, రోజూ పరగడుపున కొబ్బరినీళ్ళు తాగితే ఇక జన్మలో కడుపుమంట రాదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)