అబ్బాయిలూ ఒక సారి ఇటు చూడండి..షేర్ చేయండి..ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయి మారుపేరుతో 10 లక్షలు దొబ్బేసి.. చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేసింది

కడప జిల్లాలోని ఖాజీపేట బస్టాండు ప్రాంతంలో బి.నరసింహ వరప్రసాద్‌ (33) టీ దుకాణం నడుపుకొనేవాడు. కొంతకాలం క్రితం.. విశాఖపట్టణానికి చెందిన ఓ యువతితో అతడికి ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పడినట్లు అతని సెల్‌ఫోన్‌ ద్వారా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫేస్‌బుక్‌ పరిచయంతోనే వరప్రసాద్‌ ఆమెకు రూ.10 లక్షల వరకూ పంపాడు. అయితే ఆ తర్వాత ఆ సొమ్ము ఇవ్వాల్సిందిగా ఎన్నిసార్లు అడిగినా ఆమె పట్టించుకోలేదు. 

ఇస్తానని చెబుతూ ఆమె కాలయాపన చేస్తుండడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిన వరప్రసాద్‌.. తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దీనిపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహవరప్రసాద్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మూడు పేర్లు చెప్పేదని సమాచారం. ఎఫ్‌బీలో తన పేరును కల్యాణిగా పేర్కొన్న ఆమె.. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అనుశ్రీగా చెబుతుండేదని తెలిసింది. అలాగే ఆమె కవిత అనే పేరుతో కూడా వ్యవహరించేదని తెలుస్తోంది. దయచేసి ఇది అందరికి షేర్ చేసి మోసపోకుండా చూడండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)