రోజూ ఒక గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలు మరియు ఆరోగ్యానికి అందానికి గుడ్డు ఎలా మేలు చేస్తుందంటే ?

రోజూ ఉదయాన్నే అల్పాహారంగా ఒక గుడ్డును తీసుకొండి. దీనివల్ల ఎక్కువ ప్రొటీన్స్‌ శరీరానికి లభిస్తాయి. మీ చర్మం ముడుతలు పడిపోయి కాంతి విహీనంగా కనిపిస్తోందా! అందుకు మంచి రెమెడీ ఎగ్‌! స్కిన్‌ని టైటెన్‌ చేసి కొత్త కాంతినిస్తుంది.

పొడి చర్మం కోసం: పొడి చర్మం ఉన్న వారు గుడ్డులోని తెల్లసొనను తీసుకొని దానికి ఒక స్పూన్‌ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను పొందుతుంది.

సాధారణ చర్మం కోసం: ఒక గుడ్డును తీసుకొని దానిలో ఒక స్పూన్‌ తాజా పెరుగును కలిపి ఒక పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయటం వల్ల మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

జిడ్డు చర్మం కోసం: ఒక గుడ్డులో చెంచా ఓట్స్‌ కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు నిండుగా పట్టించాలి. కొద్దిసేపు తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్లబ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.

Popular Posts

Latest Posts