భోజనం చేసాక ఈ పనులు చేస్తే మీరు తిన్నది ఎంత క్వాలిటీ ఫుడ్ అయినా వేస్ట్ అయిపోతుంది

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. భోజనం తర్వాత కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అలా చేస్తే అరుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడీ ఉండదు.

కొందరు రాత్రిపూట భోంచేశాక స్నానం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి రెండుసార్లు చేయొచ్చు. అదే అలవాటుగా మారితే స్నానం వల్ల శరీరంలో కదలికలు అతిగా ఉంటాయి. ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడుతుంది. అరుగుదల మందగిస్తుంది. షవర్‌తో స్నానం చేయడం అస్సలు మంచిది కాదు. నీళ్ల తాలూకు ఒత్తిడి జీర్ణవ్యవస్థ మీద బలంగా పడుతుంది.

అన్నం తిన్నాక కాసేపు అటూ ఇటూ నడవొచ్చు. కానీ బ్రిస్క్‌ వాక్‌, జాగింగ్‌, ఎక్కువ సమయం నడవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల వికారం కలగొచ్చు. కొందరికి పొట్టలో తిప్పే ప్రమాదమూ ఉంది. భోంచేశాక అదీ రాత్రిపూట చల్లటి నీళ్లు తాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతాయి. గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తాయి.

భోంచేసిన వెంటనే పడుకోవడమూ మంచిది కాదు. తినడానికీ, పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. భోంచేశాక టీ, కాఫీలకూ దూరంగా ఉండాలి. తిన్న వెంటనే వేడివేడి టీ, కాఫీలు తాగడం వల్ల పోషకాలు ఒంటపట్టవు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)