కరెంట్ తక్కువని LED బల్బులు వాడుతున్నారా? ఎల్ఈడీ బ‌ల్బులు గురించి భయంకర నిజాన్ని బయట పెట్టిన డాక్టర్లు

ఎల్‌ఈడీ బల్బుల వినియోగం పెరుగుతోంది. వీటి వలన తక్కువ విద్యుత్‌ వినియోగం అవుతుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ధర తగ్గించి సబ్సిడీ మీద ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేస్తోంది. ఇప్పుడున్న వీధిలైట్లు తీసేసి వాటి స్థానం లో ఎల్‌ఈడీ బల్బులను వాడుతున్నారు. కానీ వీటి వినియోగం వలన పర్యావరణంతో పాటు మనుషులపై కూడా తీవ్ర దుష్ర్పభావాలు చూపుతున్నాయని అమెరికా మెడికల్‌ సంఘం ఓ నివేదిక తయారుచేసింది. 

ఎల్ఈడీ బ‌ల్బులు వాడ‌రాద‌ని అమెరికన్‌ డాక్టర్లు తేల్చిచెప్పారు. నివేదిక లోని వివరాల ప్రకారం... త‌క్కువ విద్యుత్తు ఖ‌ర్చు అయ్యే ఎల్ఈడీ లైట్ల‌ను వినియోగించడం వలన కంటి రెటీనా దెబ్బ‌తినే అవ‌కాశం ఉన్న‌ట్లు అమెరికా డాక్ట‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికా డాక్ట‌ర్ల అధ్య‌య‌నం ప్ర‌కారం రాత్రి పూట క‌ల‌ర్ ఉష్ణోగ్ర‌త మూడు వేల కెల్విన్లు దాట‌రాదు. ఒకవేళ ఆ స్థాయిని దాటితే దాని వ‌ల్ల నీలి రంగు కాంతి ఎక్కువ‌గా రిలీజ్ అవుతుంది. ఇటీవ‌ల సియాటిల్‌, న్యూయార్క్ న‌గ‌రాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకం వలన కంటి సంబంధ సమస్యలు ఎదుర్కోన్నట్టు పలు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించింది.

Popular Posts

Latest Posts