బట్టతల వచ్చేలా కనిపిస్తున్నప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే బట్టతల రాకుండా ఆగిపోతుంది

బట్టతల వచ్చేలా కనిపిస్తున్నప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.

20 ml కొబ్బరి నూనె ,10 ml ఉసిరి నూనె, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి తల మీద చర్మం మీద రాసి కొంత సేపు అలా వదిలేయాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇది జుట్టు రాలటాన్ని తగ్గించి బట్టతల రానీయకుండా నియంత్రిస్తుంది.

వేయించిన కొన్ని మెంతులను కొబ్బరి నూనెలో వేసి కొన్ని నిముషాలు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని తల మీద తక్కువ మొత్తంలో రాయాలి. తలపై సున్నితంగా మసాజ్ చేస్తే జుట్టు మూలాలలోకి చేరుతుంది. ఈ విధంగా వారంలో మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే బట్టతల అనే మాటే ఉండదు.

కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి భద్రపరచాలి. ప్రతి రోజు ఉసిరి నూనెను జుట్టుకు రాసి 15 నిముషాలు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)