అరటి పళ్లను మాత్రం ఆ సమయం లో అస్సలు తినకూడదు ఒక వేళ తింటే చాలా ప్రమాదం ?

ఆరోగ్యానికి మేలు చేసే ఫలాలను ఎప్పుడు తింటే ఏముంది అనుకుంటున్నారా? పండ్లను ఎప్పుడు తిన్నా మంచిదే కానీ, తినాల్సిన సమయంలో తింటే వాటి వల్ల మరిన్ని ఉపయోగాలు ఉంటాయట. సాధారణంగా ఫలాలను రోజులో ఉదయం పూట తింటే మంచిదట. దాదాపు అన్ని ఫలాలలోనూ ఎక్కువగా ఉండేది యాసిడ్స్‌ కాబట్టి ఉదయం సమయంలోనైతే అవి తేలికగా జీర్ణమవుతాయట. రోజులో ఇతర సమయాలతో పోల్చుకుంటే ఉదయం సమయాల్లో జీర్ణవ్యవస్థ కొంచెం యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి ఫలాలను తీసుకోవడానికి అదే మంచి సమయం. చాలా ఫలాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే మరీ మంచిది.

అయితే అరటి పళ్లను మాత్రం పరగడపున ఎప్పుడూ తినకూడదట. చాలా సేపటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఉదయం సమయాల్లో మన రక్తంలోని చక్కెర స్థాయులు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అయితే అధిక చక్కెర స్థాయులుండే అరటిపళ్లను పరగడుపునే తినడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగిపోతాయి. అది అంత మంచిది కాదు. అలాగే చాలా మంది భోజనం ముగించిన వెంటనే ఏదో ఒక పండును తింటుంటారు. అదీ మంచిది కాదట. జీర్ణం కావడంలో కొంత ఇబ్బంది తలెత్తే ప్రమాదముందట. అంతగా తినాలనుకుంటే భోజనం పూర్తయిన అరగంట తిర్వాత తీసుకుంటే మంచిదట.
Loading...

Latest Posts