మగాళ్లు ఎప్పటికీ, ఎవ్వరితోనూ ఈ విషయాలను పంచుకోకూడదు. అలా చేస్తే జీవితంలో ఇక పైకిరాలేరు

మగాళ్లు ఎప్పటికీ, ఎవ్వరితోనూ ఈ విషయాలను పంచుకోకూడదు. అలా చేస్తే జీవితంలో ఇక పైకిరాలేరు. ఇప్పుడు ఆ ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం.

మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పవద్దు. డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరు. పైపెచ్చు అవతలి వారు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా అది నిజమైంది కాదు.

వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియనివ్వకూడదు. అలా తెలిస్తే అవతలి వ్యక్తులు వాటిపై హాస్యమాడతారు. ఆ సమస్యలపై జోక్‌లు వేసి మరింత విసుగు తెప్పిస్తారు. ఇది సమస్యలతో బాధపడుతున్న వారిని మరింత ఆత్మన్యూనతకు లోనయ్యేలా చేస్తుంది. ఇంకా ఏంటంటే ఆ సమస్యే మన బలహీనత అవుతుంది.

ఒక వ్యక్తి తన భార్య గురించిన ఏ విషయమైనా ఇతరులతో చర్చించకూడదు. ఏ విషయాన్నయినా రహస్యంగానే ఉంచాలి. ఒక వేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తుంది. భార్య గురించిన రహస్యాలను ఇతరులతో అస్సలు పంచుకోరాదు.

ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఏ సంఘటనలోనైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరగా దాన్ని మరిచిపోవాలి. అంతేకాదు ఆ విషయం గురించి ఇతరులకు తెలియజేయకూడదు. అలా చేస్తే దానిపై వారు హాస్యమాడతారు. అప్పుడు సదరు వ్యక్తుల మనోభావాలు, గొప్పతనం దెబ్బతింటాయి. ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.

Popular Posts

Latest Posts