దేవుడా ! కొబ్బరి బొండాలను కూడా కల్తి చేస్తున్నారు.. ఇలాంటి కొబ్బరి బోండాలు ప్రాణానికే ముప్పు

ఎండా కాలం, వర్షా కాలం, చలి కాలం... ఇలా ఏ కాలంలోనైనా మనకి మేలు చేసే సహజ సిద్ధమైన పానీయం.... కొబ్బరి నీళ్ళు. ఒంట్లో వేడి చేస్తే కొబ్బరి నీళ్ళు, జ్వరం వస్తే కొబ్బరి నీళ్ళు... ఏ జబ్బుకైనా సర్వ రోగ నివారిణిగా పేరు పొందిన ఏకైక పానీయం... కొబ్బరి నీళ్ళు. మనం రోజు తాగే మంచి నీళ్ళు, పాలు దగ్గర నుండి... అప్పుడప్పుడు సరదా కోసం తాగే కూల్ డ్రింకుల వరకు అన్నిటిలోనూ కల్తీ జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో కొబ్బరి నీళ్ళు ఒక్కటే మనకు ఎలాంటి కల్తీ లేకుండా.... స్వచ్చంగా దొరికే ద్రవ పదార్థం. అందుకే కాబోలు.... కొబ్బరి బొండాల ధర ఎంత పలికినా.... అవసరమొచ్చినప్పుడు దీనిని సేవించకుండా ఉండరు. కొబ్బరి నీళ్ళ వల్ల రోగాలు తగ్గడం పక్కకు పెడితే... ఇప్పుడు కొబ్బరి నీళ్ళల్లో కూడా కల్తీ జరుగుతుందని.... ఇవి తాగడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు వైద్యులు. కొబ్బరి బొండం కాస్తా కెమికల్ బొండంగా మారుతున్నాయని అంటున్నారు.

కల్తీ ఎలా జరుగుతుందని మీకు అనుమానం రావచ్చు. ఈ తప్పుడు పనులకు పాల్పడుతుంది మనకు అన్నం పెట్టే రైతన్న అంటే నమ్మగలరా ? అన్నం పెట్టె వారే అందులో విషం కలిపితే ? ఎవరితో చెప్పాలి.... ఏమని చెప్పాలి ?

ముందుగా కొబ్బరి చెట్టు వేర్లు ఉన్న చోట తవ్వి... తల్లి వేరును కనిబెడతారు. ఆ తరువాత మోనోక్రోటోఫాస్ (Monocrotophos) అనే కెమికల్ ను ఓ కవర్లో పోసి, కట్ చేసిన తల్లి వేరును అందులో పెట్టి.... ఆపై మట్టి కప్పేస్తారు. ఇలా ఈ కెమికల్ ను బలవంతంగా చెట్టుకు తాగించడం వల్ల.... చెట్టుకు ఉన్న పిందలు బొండాలుగా మారడం.. సాధారణ సమయం కన్నా తక్కువ సమయంలో జరుగుతుంది. మోనోక్రోటోఫాస్ అనే కెమికల్ మన శరీరంలోకి చేరితే... గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. దీని వల్ల వేలల్లో ఎగుమతి చేసే బొండాలు.... లక్షల్లో ఎగుమతి అవుతున్నాయి. బొండాలు తిరిగి సాధారణ దశకు చేరుకోవాలంటే... వాటిలోని కెమికల్ పూర్తిగా నశించిపోవాలంటే కనీసం 40 రోజులు పడుతుంది. కానీ మనం తాగే బొండాలు ఎన్ని రోజులవో ఎలా చెప్పగలం?? మరి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం రైతన్నలకు కూడా అలవాటైతే... మనల్ని కాపాడేది ఎవరు??
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)