హోటల్స్ లో పని చేసే వారి నిజ స్వరూపం వాళ్ళు చేసే రహస్య పనులు తెలిస్తే షాక్ అవ్వుతారు

సాధారణంగా పర్యాటకం కోసమో లేదా బిజినెస్‌ ట్రిప్‌ కోసమో వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినపుడు అందరూ హోటల్స్‌కు వెళ్తారు. అక్కడ లభించే సాదర స్వాగతం, విపరీతమైన గౌరవ మర్యాదలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుని కట్టిపడేస్తాయి. ఇక అక్కడ ఉండే హోటల్‌ సిబ్బంది ప్రదర్శించే వినయ విధేయతలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. హోటల్‌ సిబ్బంది రహస్యంగా ఎలా ప్రవర్తిస్తారో మాత్రం ఎవరికీ తెలియదు. అది తెలుసుకుంటే మాత్రం ఇక హోటల్‌కు వెళ్లాలనిపించదు. ఈ విషయాలని స్వయంగా హోటల్‌ సిబ్బందే వెల్లడించారు. ‘విష్పర్‌ యాప్‌’ అనే ఓ కొత్త రకం యాప్‌ ద్వారా ఐడెంటిటీ బయటపడకుండా హోటల్‌ సిబ్బందే ఈ విషయాలను వెల్లడించారు.

చాలామంది సిబ్బంది హోటల్‌కు వెళ్లినపుడు లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లడమో, డబ్బులిచ్చి భోజనం చేయడమో చేయరట. అతిథులు భోజనం ఆర్డర్‌ ఇస్తే.. వాటిని తీసుకొచ్చే సమయంలోనే కొంత తినేస్తారట. అంటే వారు తినగా మిగిలింది మనకు పెడతారనమాట. ‘అతిథులు ఎవరైనా నాకు సరిగ్గా టిప్‌ ఇవ్వకుండా, నాతో అమర్యాద ప్రవర్తిండం వంటి పనులు చేస్తే.. వారి రూమ్‌ కీస్‌ను డీయాక్టివేట్‌ చేసి వారికి ఇబ్బందులు సృష్టిస్తాన’ని ఓ రూమ్‌ బాయ్‌ వెల్లడించారు. అలాగే మా హోటల్‌లో సంవత్సరానికి ఒకసారే బెడ్‌షీట్స్‌, దుప్పట్లు మారుస్తామని ఒకరు తెలిపారు. బద్దకంగా ఉన్నప్పుడు రూమ్‌లు ఉన్నా కూడా లేవని చెప్పేస్తానని మరొకరు చెప్పారు. అలాగే ఖాళీగా ఉన్న రూమ్స్‌లో సాటి వర్కర్స్‌తో లెక్కలేనన్ని సార్లు శృంగారంలో పాల్గొన్నామని చాలా మంది వెల్లడించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)