నోటి దుర్వాసనకు కారణాలు... తగ్గించుకోవడానికి చక్కటి మార్గాలు

నోరు తడారిపోవడం - తడి లేని నోట్లో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. డ్రై మౌత్‌లో సెలైవా లెవెల్స్‌ తక్కువగా ఉంటాయి. సెలైవాలో ఆక్సిజన్‌ ఉంటుంది. ఆక్సిజన్‌ ఉన్న చోట నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉండదు. లో సెలైవా = లో ఆక్సిజన్‌ = నోటి దుర్వాసన

ఆహారపదార్థాలు - కొన్ని రకాల ఆహారపదార్థాల వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్‌ ప్రొటీన్స్‌ను సల్ఫర్‌ కాంపౌండ్స్‌గా మారుస్తుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిలో సల్ఫర్‌ ఉంటుంది. ఇలాంటి ఎసిడిక్‌ వాతావరణంలో బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది.

దంత సమస్యలు - దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం ప్లాక్‌ బిల్డప్‌ అవుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, గమ్‌ డిసీజ్‌ వస్తాయి. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా రక్తాన్ని, వ్యాధి బారినపడిన గమ్‌ టిష్యూను సల్ఫర్‌కాంపౌండ్స్‌గా మార్చుతుంది.

వ్యాధులు - డ్రై మౌత్ వల్ల డయాబెటిస్‌, లంగ్‌ డిసీజ్‌ వంటి అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అనేక జబ్బులకు సెలైవా ఉత్పత్తి తక్కువ కావడమే కారణం. ఆక్సిజన్‌ తక్కువగా ఉన్నచోట నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది.

రోజు 8 గ్లాసుల నీళ్లు తాగాలి. ఆక్సిజినేటింగ్‌ ద్రవపదార్థాలతో నోరు పుక్కిలించాలి. పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు తీసుకోవడం తగ్గించాలి. కాఫీ, సిట్రస్‌ జ్యూస్‌లు, షుగరీ డ్రింక్స్‌ను తగ్గించాలి. భోజనం తరువాత తప్పనిసరిగా బ్రష్‌ చేసుకోవాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డెంటల్‌ చెకప్‌, క్లీనింగ్‌ చేయించుకోవాలి. స్మోకింగ్‌ మానేయాలి. డైట్‌లో ఫైబర్‌ శాతం పెంచాలి.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)