అమ్మాయిలకు హెచ్చరిక : ఈ నాలుగు లక్షణాలు ఉన్న అబ్బాయిలను దూరంగా ఉంచండి

ఈ కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చాలా తక్కువ అయ్యాయి.. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన పెళ్లి కూడా తమకు నచ్చినట్లు చేసుకొంటున్నారు. అయితే అలా తీసుకున్న నిర్ణయాల వలన ఆ సంబంధాలు ఎక్కువరోజులు నిలబడడం లేదు. ప్రేమించినంత కాలం బాగానే ఉన్నా ఆ తర్వాత బాధ్యతలలో పడడం వలన ఈ ప్రేమ వివాహాలు చాలావరకు బెడిసికొడుతున్నాయి. అయితే ఇటీవల చేసిన సర్వేల ప్రకారం ప్రేమించే సమయాల్లో అబ్బాయిలలో చూసిన కొన్ని లక్షణాల వలన అటువంటి వారిని దూరంగా ఉంచడమే మంచిది అని అంటున్నారు. అటువంటి లక్షణాలలో ముఖ్యంగా నాలుగు లక్షణాలను ప్రత్యేకంగా చెప్పబడడం జరిగింది.

నిగ్రహం మరియు హింస (Temper and Violence): - చీటికి మాటికి నిగ్రహాన్ని కోల్పోయే వ్యక్తుల వలన జీవితాంతం సుఖంగా ఉండే అవకాశమే లేదని సర్వేలో తేలింది. అంతేకాకుండా ఏదన్నా విషయం జరిగినప్పుడు కొట్టడం, హింసించడం లాంటివి చేయడం వలన కూడా అబ్బాయిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందట.

అవిశ్వాసం (Infedility): - ఒక్క సారి మోసం చేసాడో ఆ అబ్బాయిని ఎప్పటికీ క్షమించకండి. అంతే కాదు ఈరోజు ఒకరిని మోసం చేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకో రోజు మిమ్మల్ని మోసం చేయడని ఏమి గ్యారెంటీ అని పరిశోధకులు చెబుతున్నారు. నమ్మకం అనే గీతను చేరిపేసినపుడు తర్వాత కూడా అతన్ని నమ్మడం మూర్ఖత్వమేనట.

వ్యసనం (ADDICTION): - ఎటువంటి చెడు అలవాటుకైనా బానిస అయితే అతన్ని దూరంగా ఉంచడమే మేలట.. మీకు మొదట్లో మానేస్తాము అని చెప్పినా తర్వాత మానేయడం అనేది జరగదని పరిశోధకుల వాదన. ప్రేమించిన తర్వాత వ్యసనాల ద్వారా ఎన్నో జంటలు విడిపోయాయని సర్వే ఒక అంచనాకు వచ్చింది.

స్వాధీనత స్వభావం (Possessiveness):- ఈ వ్యవహారశైలి అబ్బాయిలలో ఉండడం వలన అమ్మయిలకు చాలాప్రమాదమట. అమ్మయిలు ఎవరినైనా మాట్లాడినా, పలకరించినా పొసెసివ్ బిహేవియర్ వలన వారిపై ద్వేషం పెంచుకోవడం అమ్మాయిలకు స్వేచ్ఛ అనేదే లేకుండా చేసే ప్రమాదం ఉందని సర్వేలో తేలింది.
పై నాలుగు స్వభావాలు మీ ప్రియుడిలో ఉంటె చాలా వరకు దూరం చేసుకోవడమే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

Popular Posts

Latest Posts