ఏడు రోజుల్లో ఖచ్చితంగా బరువు తగ్గించుకునే చిట్కాలు. ప్రయత్నించి చూడండి

బరువు ఎక్కువగా ఉన్న వారికి ఏకైక కోరిక బరువు తగ్గడం ఎలా అని, కాని దాని గురించి ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తూనే ఉంటాము. ఏడు రోజుల్లో బరువు తగ్గించుకునే కొన్ని చిట్కాలు ఈ క్రిందన ఇవ్వబడ్డాయి. ఇలా ప్రయత్నించి చూడండి.

మొదటి రోజు :- అరటి పండు తప్పించి, మిగిలిన అన్ని పండ్లను ఆహారంగా తీసుకోండి. ఎంత కావాలంటే అంత, ఎన్ని రకాల పండ్లు అయినా తినచ్చు. పుచ్చ కాయ ఎక్కువగా తింటే మంచిది. పండ్లు ఎక్కువగా తినడం వలన మిగిలిన ఆరు రోజులు జీర్ణ వ్యవస్థను సిద్ద పరుస్తుంది.

రెండో రోజు :- పొద్దుటే ఉడికించిన బంగాలదుంపను తిని, ఆ రోజంతా కూరగాయలను ఆహారంగా తినాలి. ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టు తినచ్చు. నూనె మాత్రం తినకూడదు.

మూడో రోజు
:- పండ్లు మరియు కూరగాయలు రెండు తినచ్చు. కాని అరటి పండు, బంగాళదుంప తినకూడదు. ఈరోజు నుంచి అదనపు కొవ్వు కరగడం మొదలవుతుంది.

నాలుగో రోజు :- నాలుగవ రోజున అరటిపండ్లు, పాలు తీసుకోవచ్చు. ఈ రోజు అంతగా ఆకలి అనిపించదు. 8 అరటి పండ్లు వరకు తినచ్చు. 100 ml తాజా కాయగూరలతో ఇంట్లోనే జ్యూస్ చేసుకొని తాగచ్చు.

ఐదో రోజు :- కప్పు అన్నం, 6 టమాటాలు తీసుకోవాలి. అన్నంలో నూనె లేకుండా వండిన కూరగాయలు కూర వేసుకోవచ్చు.

ఆరో రోజు :- ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. రెండవరోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బంగాలా దుంప మినహా) తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే, కూరగాయలకు లిమిట్ లేదు. అయినప్పటికీ ఆకలి లేకపోవడం వల్ల రెండవరోజు తిన్నంత అవసరం లేదు.

ఏడో రోజు :- ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. ఆరవరోజులాగే తింటూ, ఆనందంగా కూరగాయలను కాస్త తగ్గించి పళ్ళరసం (చక్కెర లేకుండా) తీసుకోవాలి. మధ్యాహ్నం ఒకప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినటానికి ప్రయత్నించండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)