చెడు కలలు చెడు జరగడానికి సంకేతమా ? చెడు కలలు ఎందుకు వస్తాయి ? వాటి అర్థమేంటి ?

Loading...
పాము మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కల కన్నారా ? లేదా మరేదైనా ప్రమాదకరమైన జంతువు వెంబడించిందా ? ఒకవేళ ఇలాంటి కలలు మీకు వస్తున్నాయంటే భయపడకండి.. మీకు మాత్రమే కాదు.. చాలామందికి ఇలాంటి కలలు వస్తాయి. మనందరికీ చాలా తరచుగా చెడు కలలు వస్తూ ఉంటాయి.

అయితే కలలు చాలా రకాలుగా వస్తాయి. కొంతమందికి దయ్యాలు, పాములు, దేవుళ్లు, బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ ఇలా.. ఎవరో ఒకరు కలలో కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లతో మాట్లాడినట్లు, పోట్లాడినట్లు కూడా కలలు వస్తుంటాయి. అలాగే కొన్ని కలలు సంతోషాన్నిస్తాయి. మరికొన్ని బాధ కలిగిస్తాయి. ఇంకా కొన్ని కలలైతే.. భయాందోళనకు గురిచేస్తాయి.

ఇలా భయపెట్టే కలలనే చెడు కలలుగా చెబుతారు. ముఖ్యంగా చెడు కలలు తెల్లవారుజామున 3 గంటలకి ఎక్కువగా వస్తాయట. అందుకే ఆ సమయంలో మనకు నిద్రలో మెలుకువ వచ్చేస్తుంటుంది. ఇలాంటి కలలను అప్పటికప్పుడే మరిచిపోవాలని ప్రయత్నిస్తాం. కానీ అలాంటి భయంకరమైన కలలు వచ్చినప్పుడు రెండు మూడు రోజుల పాటు.. అదే భయం వెంటాడుతూ ఉంటుంది. మరి ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి ? వాటి అర్థమేంటి ? చెడు కలలు చెడు జరగడానికి సంకేతమా ? అయితే చెడు కలలు వచ్చే వాళ్లు సృజనాత్మక ఆలోచనలు కలిగినవాళ్లని అధ్యయనాలు నిరూపించాయి.

చెడు కలలు లోలోపల భయం, ఆందోళనను ప్రతిబింబిస్తాయి.
చాలా వరకు చెడు కలలకు అర్థాలు ఉంటాయి. అలాగే మన స్వభావాన్ని వివరిస్తాయి. అవి మనకు ఫీలింగ్స్, ఆలోచనలు తీసుకొస్తాయి.

ఒకవేళ ఎప్పుడైనా మీకు.. మీరు ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడినట్లు కల వచ్చిందా ? అలాగే మీ కాళ్లను ఎవరో లాగుతున్నట్లు ? ఇలాంటి కలలు ఫ్రీడమ్ లేకపోవడాన్ని, మీ చేతుల్లో పవర్ లేకపోవడాన్ని సూచిస్తాయి. మన జీవితంలో ఏదో ఒక సమస్యను కంట్రోల్ చేయలేకపోతున్నారని తెలుపుతుంది.

ఏదైనా యాక్సిడెంట్ కి గురయినట్లు, గాయపడినట్లు కల వచ్చిందంటే.. మీ పర్సనల్ లైఫ్ బలహీనంగా ఉందని తెలుపుతుంది. అలాగే ఈ కలలు మీలో ఆత్మ గౌరవం పెంచుకోవాలని సూచిస్తాయి. ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి సమస్య వచ్చినా.. ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తాయి.
ప్రకృతి వైపరీత్యాలు జరిగినట్లు, వాటిలో ఇరుక్కుపోయిట్టు లేదా వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెడుతున్నట్టు కలలు వచ్చాయా ? ఇలాంటి కలలు త్వరలో జరగబోతున్న ఈవెంట్ కి సంబంధించి భయం, ఆందోళనను సూచిస్తాయి. అలాగే రోజు చేస్తున్న విషయాలపై ఒత్తిడిని కూడా సూచిస్తుంది.
మనం స్కూల్ కి వెళ్తున్న వయసులో చాలామందికి ఎగ్జామ్ మిస్ అయినట్టు, ఫెయిల్ అయినట్టు కలలు వచ్చేవి. ఈ కలలు భయం, ఆందోళన, మనపై ఇంట్లో వాళ్లు పెట్టుకున్న ఎక్స్ పెక్టేషన్స్ కి ఒత్తిడికి గురవుతున్నట్లు సూచిస్తుంది. మనం మన పని సక్రమంగా చేస్తున్నా.. ఇలాంటి కలలు వస్తున్నాయంటే.. మనం నెగటివ్ గా ఆలోచిస్తున్నామని సూచిస్తుంది.
చనిపోయిన వ్యక్తిని చూసినట్టు చాలామందికి కలలు వస్తుంటాయి. కొంతమంది వాళ్ల మరణాన్ని చూసే భయపడుతుంటారు. ఇటీవలే చనిపోయిన వ్యక్తిని మనం కలలో చూశారంటే.. వాళ్లు చనిపోవడాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు.. వాళ్లు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారని ఇంకా భావించకపోవడం. మనమే చనిపోయినట్టు కల వచ్చిందంటే.. పాజిటివ్ డెవలప్ మెంట్ ని సూచిస్తుంది.
ఎవరో మనల్ని ఎటాక్ చేస్తునట్టు కలలు వస్తుంటాయి. గన్ లు లేదా ఆయుధాలు పట్టుకుని వెంటాడుతున్నట్లు లేదా జంతువులు వెంబడిస్తున్నట్లు కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు.. మీరు జీవితంలో ఏదో సమస్యను పరిష్కరించడానికి కష్టపడుతున్నారని తెలుపుతుంది.
కొన్నిసార్లు మన భాగస్వామి మనకు దూరంగా, మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయినట్టు లేదా ఎవరో వాళ్లను కిడ్నాప్ చేసినట్టు కలలు వస్తుంటాయి. మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతుంది. వాళ్లతో హ్యాపీగా లేమని, ఇన్ సెక్యూర్ గా ఫీలవుతున్నామని.. ఈ కలలు సూచిస్తాయి.
ఎక్కడో మనల్ని ట్రాప్ చేస్తున్నట్టు కలలు వస్తే.. మనం కష్టాల్లో ఉన్నామని, ఇష్టంలేని పని చేస్తున్నామని తెలుపుతుంది. ఇది రిలేషన్ షిప్ ప్రాబ్లమ్ లేదా వర్క్ లో ఫెయిల్యూర్ అయినా కావచ్చు.
మిమ్మల్ని మీరే కలలో నగ్నంగా చూసుకుంటే.. ఆత్మగౌరవం తక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. అంతర్గత భయాన్ని సూచిస్తుంది. మనల్ని ఎదుటివాళ్లు ఎలా చూస్తున్నారో అన్న భయం ఎక్కువగా ఉంటుంది.
కలలో పాములు కనిపిస్తే చాలా మంది భయపడతారు. వాస్తవంగా వాటిని చూడటానికి, కలలో వాటిని చూడటానికి చాలా అర్థం ఉంది. నెగటివ్ ఆలోచనల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని సూచిస్తుంది. అలాగే సమస్యలను పరిష్కరించుకోబోతున్నారని సంకేతం.
Loading...

Popular Posts