ఇది తాగితే వారంలోనే అధిక బ‌రువును కచ్చితంగా తగ్గించుకోవచ్చు

అధిక బ‌రువు స‌మ‌స్య ఉంటే దాని వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి వ్యాధులు వచ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో అలాంటి అనారోగ్యాలను త‌గ్గించుకోవ‌డం కోసం, ఆరోగ్యంగా ఉండ‌డం కోసం అధిక బ‌రువును కచ్చితంగా త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో అధిక శాతం మంది బ‌రువు త‌గ్గేందుకు అనేక ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. అయితే కింద ఇచ్చిన ఓ డ్రింక్‌ను తాగితే వారంలోనే శ‌రీర బ‌రువులో గ‌ణ‌నీయ‌మైన మార్పును తీసుకురావ‌చ్చు. ఈ డ్రింక్ ఏమిటో, దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక నిమ్మ‌కాయ‌, 60 గ్రాముల కొత్త‌మీర‌, 300 ఎంఎల్ నీటిని తీసుకోవాలి. అనంత‌రం నిమ్మ‌కాయ నుంచి ర‌సం తీసి దాన్ని కొత్తిమీర‌, నీటికి క‌ల‌పాలి. మొత్తాన్ని క‌లిపి మిశ్ర‌మంగా మిక్సీ ప‌ట్టాలి. అనంత‌రం వ‌చ్చే డ్రింక్‌ను తాగాలి. ఇలా ఆ డ్రింక్‌ను ఏ రోజుకారోజు త‌యారు చేసుకుని 5 రోజుల పాటు వ‌రుస‌గా తాగాలి. ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు ఈ డ్రింక్‌ను సేవించాలి. ఒక‌ 10 రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన త‌రువాత మళ్లీ 5 రోజుల పాటు వ‌రుస‌గా తాగాలి. ఇలా తాగుతుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)