ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు తినేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్

ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చాక పల్లెల్లో, పట్టణాల్లో పాలను వాటిలో నిల్వ ఉంచడం పరిపాటిగా మారింది. అయితే పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదట. పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో కింద అరల్లోనే నిల్వ ఉంచాలట. ఎందుకంటే ఫ్రిజ్‌లో శీతల వాతావరణం అన్ని అరల్లో ఒకే విధంగా ఉండదట. పాలను పై అరల్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా తయారయ్యి... అనారోగ్యానికి దారి తీస్తుందట. 

ఈ విషయాన్ని ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాదు, ఫ్రిజ్‌లో ఎక్కువ రోజుల నిల్వ ఉంచిన పదార్థాలు తినడం మంచిది కాదని తేల్చింది. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ఆహార పదార్థాల్లో శీతల ఉష్ణోగ్రతకు రసాయనిక చర్య జరుగుతుందని... ఈ పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)