బయటకు చెప్పినా చెప్పకపోయినా మన ఊహల్లో కొన్ని సెక్స్ కోరికలు ఉంటాయి వాటి గురించి సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి

మనిషి అన్నాక లైంగిక కల్పనలు సర్వసాధారణం. మనం బయటకు చెప్పినా చెప్పకపోయినా అది నిజం. మనిషిలో ఉండే లైంగిక కల్పనలు, లైంగిక వాంఛలపై ఇటీవలే నిర్వహించిన సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సెక్సువల్ ఫాంటసీల్లో స్త్రీ, పురుషుల మధ్య ఏమాత్రం తేడా లేదని నిర్దారణ అయింది. ప్రధానంగా ఆరు సెక్యువల్ ఫాంటసీస్ ఆడ, మగలో కామన్ గా ఉన్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఆరు కామన్ సెక్యువల్ ఫాంటసీస్ ఎంటో చూసేద్దామా...

రోల్ ప్లే - వినేందుకు ఇది విడ్డూరంగ ఉన్నా. లైంగిక కల్పనల్లో 'రోల్ ప్లే' సర్వసాధారణమైందని తేలిపోయింది. మరొకరి చేతిలో బంధీగా చిక్కుకుపోయిన తమ భాగస్వామిని తాను తప్పిస్తున్నట్లు ఫీల్ అవడాన్నే 'రోల్ ప్లే' అని అంటారు. స్కూల్ టీచర్ నుంచి వీధి రౌడి వరకు ఇలా ఎవరి చేతిలో అయినా బంధీగా చిక్కినట్లు ఫీల్ అవుతారని వెల్లడైంది. కేవలం కల్పనకే అయినా ఇది ఇద్దరిని శారీరకంగా, మానసికంగా మరింత దగ్గర చేస్తుందని లైంగిక నిపుణులు అంటున్నారు. రోల్ ప్లేలో కేవలం ఊహాజనితమైందని, ఎవరు ఏమి ఊహించుకుంటారో ఏమాత్రం ఖచ్చితంగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

ముగ్గురితో శృంగారం ( త్రీసమ్ ) - ఇది స్త్రీ, పురుషుల్లో కామన్ గా ఉండే మరొక సాధారణ సెక్సువల్ ఫాంటసీ. తామిద్దరే కాకుండా మూడో వ్యక్తి కూడా తమ శృంగార కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరుకోవడమే త్రీసమ్. ఇది చాలా ప్రమాదకరమై, హీయమైన కోరిక. పోర్న్ సినిమాల్లో చూసేందుకు బాగానే ఉన్నానిజజీవితంలో దీన్ని పాటిస్తే తాత్కాలికంగా ఆనందం కలిగినా దీర్ఘకాలికంగా ఇది స్త్రీ, పురుషులిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని దారుణంగా దెబ్బతీస్తుందని సర్వేలో వెల్లడైంది.

కొత్త ప్రదేశాల్లో - రోజు ఒకే గదిలో శృంగారంలో పాల్గొనే వాళ్లు కొత్త ప్రదేశాల కోసం ఆర్రలు చాస్తారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా విహార యాత్రలప్పుడు ఈ ఆశ భయంకరంగా పెరుగుతుందని పేర్కొంది. కొత్త ప్రదేశాల జాబితా కూడా చాలా పెద్దగా ఉందని తేలింది. హిల్స్ స్టేషన్ , బీచ్ , రిసార్ట్, లైబ్రరీ, కారు, కార్ పార్కింగ్, బాత్ రూం తదితర ప్రదేశాలున్నాయి. కొంత మంది అయితే బయటకు కనపడకుండా 'సెమీ పబ్లిక్ ప్లేసెస్' ఇష్టపడుతున్నట్లు తేలింది. కొత్త ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే వచ్చే మజా వేరని స్త్రీ, పురుషులు వెల్లడించారు. బోరింగ్ సెక్స్ కి ఇదే విరుగుడని ఇరువురు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

తినుబండారాలు - ఫోర్ ప్లేలో భాగంగా ఐస్ క్రీం, చాక్లెట్ తదితర పదార్థాలు వాడడంలో స్త్రీ, పురుషుల్లో తేడా లేదని నిర్దారణ అయింది.

గుర్తుతెలియని వ్యక్తితో - కొంత మందికి ఈ అంశం జీర్ణంకాకున్నప్పటికీ సెక్యువల్ ఫాంటసీల్లో ఇది కూడా ఒకటి. ముక్కుమొహం తెలియని వ్యక్తితో శృంగారంలో పాల్గొనాలన్న ఆశ స్త్రీ, పురుషుల్లో సమానంగా ఉందని బహిర్గతమైంది. 'వన్ నైట్ స్టాండ్'కు ఇది పూర్తిగా విరుద్ధం. సరదాగా అలా బయటకు వెళ్లి తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకొని వారితో రమించాలన్న కోరికలో స్త్రీ, పురుషులకు మధ్య తేడా లేదని పేర్కొంది. అయితే చుట్టూ ఉండే పరిసరాలను బట్టి ఈకోరిక బయటకు రావడం,రాకపోవడం ఆధారపడి ఉంటుందని సర్వేలో తేలింది.

సెలబ్రిటీతో సెక్స్ - సెలబ్రిటితో పడక పంచుకోవాలన్న కసి ఆడ, మగలో సమానంగా ఉందని సర్వేలో వెల్లడైంది. తమ మనోభావాల ఆధారంగా ఆయా సెలబ్రిటిలను ఇష్టపడడం జరుగుతూ ఉంటుందని తెలిపింది. సెలబ్రిటీలపై మోజు పడ్డప్పటికీ జీవిత భాగస్వామలపై ఆప్రభావం ఏమాత్రం ఉండదని సర్వేలో వెల్లడైంది.

Popular Posts

Latest Posts