ఇంగ్లిష్ మందులు వాడకుండా కడుపులో గ్యాస్, మంట తగ్గాలంటే

కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయినా, వేళ తప్పించి తిన్నా, అతిగా తిన్నా, మద్యం, పొగ తాగినా, ఒత్తిడి అయినా … ఇలా కారణాలు ఏమున్నా నేడు మనలో అధిక శాతం మంది గ్యాస్, కడుపులో మంట సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సాధారణంగా వచ్చే గ్యాస్ సమస్యలే అయితే ఇంగ్లిష్ మందులు వాడకుండా సహజంగా దొరికే తేనెతోనే వాటిని తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తేనెను వివిధ రకాల పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ తేనెను కలపాలి. దీన్ని భోజనానికి గంట ముందుగా లేదా భోజనం అనంతరం గంట తర్వాత తాగాలి. లేదంటే రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. అయితే దీన్ని తాగిన తరువాత దాదాపు 20 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. లేదంటే తేనె తన ప్రభావాన్ని చూపించదు.

ఒక టేబుల్ స్పూన్ తేనె, 3/4 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి భోజనం తరువాత తీసుకుంటే గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు

కప్పు నీటిని మరిగించి అందులో 1 టీస్పూన్ అల్లం మిశ్రమాన్ని వేయాలి. అనంతరం వేడి తగ్గించి సిమ్మర్‌లో 5 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఈ ద్రవానికి 1 టీస్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచూ తీసుకోవాలి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలిపి దీన్ని గ్యాస్ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాలి.

ఒక టీస్పూన్ తేనె, 200 గ్రాముల పెరుగును కలిపి భోజనం అనంతరం తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా లవంగ పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి ఆ ద్రవాన్ని తాగాలి. కడుపులో మంటగా ఉన్నప్పుడు లేదా భోజనం తరువాత దీన్ని తాగవచ్చు.

రెండు టీ స్పూన్ల నిమ్మరసం, 1 టీస్పూన్ తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. దీన్ని భోజనానికి గంట ముందు లేదా ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరచూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల తేనె, యాపిల్ సిడర్ వెనిగర్‌లను ఒక కప్పు నీటిలో బాగా కలిపి ఆ ద్రవాన్ని సమస్య ఉన్నప్పుడు తీసుకోవాలి.

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి పూర్తిగా కలిసేంత వరకు కలియతిప్పాలి. అనంతరం ఆ ద్రవాన్ని తాగితే గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తొలగిపోతాయి.

ఒక కప్పు గ్రీన్ టీలో 1 టీస్పూన్ తేనెను కలిపి తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.

కొవ్వు లేని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ తేనెను కలిపి తరచూ తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.

తేనె, బేకింగ్ సోడా, యాపిల్ సిడర్ వెనిగర్‌లను 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని మిశ్రమం అయ్యేంత వరకు బాగా కలపాలి. అర లీటరు గోరు వెచ్చని నీటికి ఈ మిశ్రమాన్ని కలపాలి. దీన్ని భోజనానికి ముందుగా లేదా సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)