చూడటానికి పిచ్చి మొక్కలా కనిపించే కలబంద నిజానికి సకల వ్యాధి నివారిణి. ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతం

చూపులకు పిచ్చిమొక్కగా కనిపిస్తూ, సాధారణంగా ఇంటికి దిష్టి తగలకుండా పెంచుకునే కలబంద మొక్క సర్వరోగాలకు దివ్యౌషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతపరంగా పేర్కొనవచ్చును దీనిలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ కలబందను తీసుకోవడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అధర్వణ వేదంలో కలబందను అద్భుత రోగ నివారిణిగా పేర్కొన్నారు. ఉష్ణ ఖండమైన అఫ్రికాకు చెందిన కలబంద మొక్కలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. దీనిని చైనా తదితర దేశాలలో చర్మ సంబంధిత వ్యాధుల నిర్మూలనకు ఎక్కువగా వాడుతున్నారు. మనదేశంలో సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి రకరకాల లోషన్లు, క్రిములు, జ్యూస్‌, హెయిర్‌ అయిల్‌ లాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని ఉత్పత్తులు బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి.

సకల వ్యాధి నివారిణి :- ఆయుర్వేద వైద్యపరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న కలబంధ అటు తరుణ వ్యాధులకు, ఇటు దీర్ఘ వ్యాధులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది. దీనిలో మనిషి శరీరానికి కావలసిన ఎనమిది ఎమైనీ ఆమ్లాలతో పాటు అనేక ఖనిజాలు 200కి పైగా వివిధ మూలకాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరచి రోగ నిరోధక శక్తిని అధికం చేస్తుంది.

మన శరీరంలోని అనేక రోగాలకు కారణం జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవడమే. శరీరం ఆహారం లేని పోషకాలను సరిగా గ్రహించక పోవడం వలన అనేక వ్యాధులు సంభవించి రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కలబంధ జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీనితో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి శరీరం నూతన శక్తిని పొంది ఆహారంలోని పోషక విలువలను గ్రహిస్తుంది. కలబంద రసం తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది మలబద్దకం పోగొడుతుంది. డయేరియా వంటివి తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా కలబంద జ్యూస్‌ తాగితే అలసట, శక్తి హీనత వంటివి కూడా మాయమై శరీరం మంచి పుష్టిగా ఉంటుంది. శరీర బరువు సమతుల్యతలో ఉంటుంది. వయసు పై బడిన వారికి సైతం శరీరంలోని మలినాలను పోగ్టొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది. కీళ్ళ అరుగుదల, కీళ్ళ నొప్పుల వింవి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీరాకణాలను ఉత్పత్తి చేస్తుంది.

ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది. చర్మ సంరక్షణలో ఎంతగానో తోడ్పడే కలబంధ దంతక్షయ నివారిణిగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నోటితో దంత క్షయానికి కారణమయ్యే బాక్టీరియాను నిర్మూలించడంలో కలబంధ జెల్‌ ప్రభావ వంతంగా పనిచేస్తుందని పలు అధ్యయ నాలు చెబుతున్నాయి. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంధ జెల్‌తో తయారైన పేస్టులతో పళ్లు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మ సంరక్షణ ర్యాసిస్‌, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవడం మొదలగు వాటికీ కలబంద మంచి ఫలితాల్నిస్తుంది. 15 రకాల పోషకాలు మిళితమై మంచి శక్తి నిస్తాయి.
కలబంద గుజ్జును రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే శరీరంలోని మృతకణాలు పోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. గుండె మంటను తగ్గించుకునేందుకు, అజీర్తి వల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతో దోహద పడుతుంది.

కేశ, చర్మ సౌందర్యం కోసం :- అందానికి నిలువెత్తు నిర్వచనమైన కలబంద, కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లి నీటి తో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం సంతరించుకుంటుంది.

చర్మానికి మరియు ఎండలో బయట తిరిగి ఇల్లు చేరుకునే సరికి సున్నితమైన చర్మం రంగు మారడం కమిలిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు చిన్న గిన్నెలో ఐదారు చెంచాల పాలుపోసి శుభ్రమైన వస్త్రం లేదా దూదిని అందులో కొద్దిసేపు ఉంచి తీసి ముఖంపై మర్థన చేస్తూ తుడవాలి. ఇలా ఆరేడు నిమిషాలు చేశాక చల్లి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు. జుట్టు సంరక్షణ విషయంలోనూ కలబంద కీలకపాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా మంచి నిగారింపును సంచరించుకుంటుంది. తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం చుండ్రులను ఇది నివారిస్తుంది. తలలో వచ్చే అనేక పుండ్లను దురదలను ఇది తగ్గిస్తుంది. కళ్ళు మంటలు తగ్గుతాయి. అరికాల పగుళ్ళను కలబంద మటుమాయం చేస్తుంది. ఇది గృహోపయోగ మొక్కగా ప్రాచుర్యం పొందింది. దీని వల్ల కలిగే అనేక ఉపయోగాలను బట్టి , దీనిని అద్భుతమైన మొక్క. సహజ నివారిణి అని కూడా అంటారు. కలబంద ఆకులో నాలుగు పొరలు ఉన్నాయి. మొదటి పొర మందంగా ఉండి మొక్కను రక్షిస్తుంది. రెండవ పొరలో ఉన్న పసరు చేదు రసము. మూడవది జిగురు పదార్థము. నాలుగవది జిగురు కలబందలోని లోపలి పొరలో ఉండే కలబంద జిగురు.

పెంచే విధానం
:- ఇంటిలో మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి కావలసినంత స్థలం ఉండి కూడా కొంతమంది సాధారణ మొక్కల కన్నా ఔషధ మొక్కలను పెర్లో పెంచుకోవడం ఎంతో ఆసక్తి చూపిస్తారు. వీటి పెంపకం వలన ఇంటికి అందంతో పాటు ఇంటిలో వారికి ఆరోగ్యం లభిస్తుంది. చూడడానికి ఈ కలబంధ కొంచెం ముళ్లు కలిగి ఉండి దప్పంగా ఉంటుంది. దీనిలో జిగరు లాంటి గుజ్జు పదార్థం ఉంటుంది. ఇది పొడవుగా ఉంటుంది. కాబట్టి గాలిలో ఉన్న తేమను పీల్చుకుని జీవించే గుణం కలిగి ఉంటుంది. రోజంతా ఎండలో ఉన్నా కూడా ఈ మొక్కకు ఎటువంటి ఇబ్బందే ఉండదు.

Popular Posts

Latest Posts