కొవ్వు పెరగాలన్నా తగ్గాలన్న దానికి కారణం మెటబాలిజం కాబట్టి మెటబాలిజం స్పీడవ్వాలంటే ఈ సూత్రాలు పాటించాలి

మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయ్యే విధానమే మెటబాలిజం. ఇది ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. ఏ సమయంలోనైనా దీని వేగం పెరగొచ్చు, తగ్గొచ్చు. పెరిగితే ఫర్వాలేదు. తగ్గితే శక్తి కొవ్వుగా పేరుకుపోతుంది. కాబట్టి మెటబాలిజంను నీరసించిపోకుండా పరుగులు పెట్టించాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

ఈ కొవ్వులు తినాలి: డార్క్‌ చాక్లెట్‌, అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌, పీనట్‌ బటర్‌, వాల్‌నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్‌, చేపలు, సోయాబీన్స్‌…వీటిలో హెల్దీ ఫ్యాట్స్‌ ఉంటాయి. కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకుని యానిమల్‌ ఫ్యాట్స్‌ను కట్‌ చేయాలి.

స్మాల్‌ మీల్స్‌:
రోజుకి మూడు సార్లు కాకుండా ప్రతి మూడు గంటలకు కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుంటే గంటలపాటు కొవ్వు కరుగుతూ ఉంటుంది.

లీటర్లకొద్దీ నీళ్లు: రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీరు తాగిన పది నిమిషాల్లోనే మెటబాలిజం 30 శాతం పెరిగి 30 నిమిషాలకు స్పీడు అందుకుంటుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.

8 గంటల నిద్ర: శరీరం రోజంతా సమర్ధంగా పనిచేయటానికి నిద్ర ఉపకరిస్తుంది. నిద్రలేమి మెటబాలిజంను కుంటుపరుస్తుంది. దాంతో తక్కువ శక్తి ఖర్చవటంతోపాటు ఆకలి పెరుగుతుంది. కాబట్టి మెటబాలిజం స్పీడవ్వాలంటే కంటినిండా నిద్ర పోవాలి.

డైటింగ్‌ రూల్స్‌: డైటింగ్‌ పేరుతో శరీరానికి అందే క్యాలరీలలో కోత వేస్తే నష్టమే ఎక్కువ. డైటింగ్‌ చేసేవాళ్లు ఎత్తును బట్టి రోజుకి 1350 నుంచి 1500 క్యాలరీలకు తగ్గకుండా ఆహారం తీసుకోవాలి.

తప్పనిసరి పదార్థాలు: కొన్ని పదార్థాలు మెటబాలిజం వేగాన్ని పెంచుతాయి. చేపలు, గ్రీన్‌ టీ, పచ్చిమిర్చి, పుచ్చకాయ, బాదం, యాపిల్స్‌, సోయాబీన్‌ అలాంటివే! వీటిలో కొన్నిటినైనా ప్రతిరోజూ తీసుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)