భరించలేని నడుము నొప్పికి ఇంట్లోనే చిట్కాలు

లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందున, నొప్పి నివారిణుల కోసం హోం రెమెడీస్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. లోయర్ బ్యాక్ పెయిన్ నివారించడంలో ఎలాంటి హోం రెమెడీస్ ఎక్కువగా ఉపయోగపడుతాయని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లోయర్ బ్యాక్ పెయిన్ కు డాక్ట్సర్స్ ను ముఖ్యంగా ఆర్థోపెడిషియన్స్ ను కలిసినా..నొప్పిని త్వరగా తగ్గించుకోలేకపోతున్నారు. ఎక్సెసివ్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎలాంటి మెడికేషన్స్ పెద్దగా పనిచేయవు . కానీ వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం పొందవచ్చు

బెడ్ రెస్ట్ తగ్గించుకోవాలి: లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు బెడ్ రెస్ట్ తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుందని భావిస్తారు. కానీ డాక్టర్ల సలహా ప్రకారం, బెడ్ రెస్ట్ తీసుకోవడం తగ్గించాలని సూచిస్తున్నారు. ఎక్కువ నిద్రపోవడం వల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల తరచు వచ్చే బ్యాక్ పెయిన్ ను నివారించుకోవచ్చు.

వ్యాయామం: లోయర్ బ్యాక్ పెయిన్ నివారించడంలో వ్యాయామం లేదా వర్కౌట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, లోయర్ బ్యాక్ పెయిన్ ను నివారిస్తాయి. బ్యాక్ పెయిన్ తగ్గించడానికి సరిపోయే వ్యాయామాలను ఎంపిక చేసుకొని నిపుణులు సమక్ష్యంలో రెగ్యులర్ గా చేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు,.

యోగ: లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించడంలో మరో ఎఫెక్టివ్ మార్గం యోగ. యోగా యొక్క అద్భుతమైన ఫలితాలను శాస్త్రీయంగా కూడా అంగీకరించబడినవి.లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి యోగ నిపుణుల సమక్షంలో కరెక్టైన యోగాసనాలను నేచుర్చుకోవాలి. వీటిని రెగ్యులర్ గా చేస్తుంటే లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు.

కూర్చొనే విధానం
: లోయర్ బ్యాక్ పెయిన్ కు ప్రధాణ కారణం కూర్చొనే భంగిమ తప్పుగా ఉండటం. ఈ ఒక్క బేసిక్ రీజన్ వల్లే బ్యాపెయిన్ ఎక్కువగా బాధిస్తుందని డాక్టర్స్ మరియు ఫిజియోథెరఫిస్టులు సూచిస్తున్నారు . ఎక్సెసిస్ లోయర్ బ్యాక్ పెయిన్ కు సరైన భంగిమలో కూర్చోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

పొట్ట భాగంలోని కండరాలను బలోపేతం చేసుకోవాలి: ఆబ్డామినల్ మజిల్స్ వీక్ గా ఉన్నట్లైతే లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణమవుతుంది. కాబట్టి, పొట్ట ఉదరంలో కండరాలను బలపరుచుకోవాలి. అందకు సరైన ఆహారం తీసుకుంటూ , హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఆబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.

తరచూ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం తగ్గించాలి: సాధారణంగా పెయిన్ కిల్లర్స్ టెంపరెరీగా ఉపశమనం కలిగిస్తాయి . అంతే కాదు, వీటిని రెగ్యులర్ గా తింటుంటే ఇతర సైడ్ ఎపెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి . లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ లో అంధించే పెయిన్ కిల్లర్స్ ను మానేసి హెల్తీ నేచురల్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)