నాన్ వెజ్ తినడం మంచిదే ఏం తింటే ఏం లాభమో తెలుసుకోండి

మేక, గొర్రె మాంసంలో ప్రతి 100 గ్రాములకు 25 గ్రాముల ప్రొటీన్లతో పాటు 63.8 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌, 3.2 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటాయి.

100 గ్రాముల బీఫ్‌లో 29గ్రాముల ప్రొటీన్లు, 73.1 మిల్లీగ్రాముల కొలెస్ర్టాల్‌, 2.9 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది.

అలాగే 100 గ్రాముల ఫోర్క్‌(పంది మాంసం)లో 24 గ్రాముల ప్రొటీన్లు, 76 గ్రాముల కొలెస్ర్టాల్‌ ఉంటుంది. 

100 గ్రాముల బ్రెస్ట్‌ చికెన్లో 24 గ్రాముల ప్రొటీన్లతోపాటు 1.5 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది. 

100 గ్రాముల చేపలో 22గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. వాటితో ఆరోగ్యోనికి హాని కలిగించే స్టాట్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆ మాంసాల్లో ఉంటాయి. వాటిని అధికంగా భుజిస్తే మాత్రం గుండె సంబంధితవ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వాటి వివరాలు ఇలా ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా ప్రతి 100 గ్రాముల బీఫ్‌లో 3.00 గ్రాముల శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. చికెన్‌లో 1.7 గ్రాములు, మేక, గొర్రె మాంసంలో 0.79 గ్రాములు ఉంటుంది. 

అన్నింటి కంటే అతి తక్కువ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉండి, నాన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఫిష్‌ను తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)