ఉదయాన్నే పరగడుపున ఒకే ఒక్క గ్లాస్ మజ్జిగలో ఇవి కలిపి తాగండి ఎలాంటి పొట్టైనా, శరీరంలో అధికంగా ఉండే కొవ్వయినా సులువుగా కరుగుతుంది

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే తమ దిన చర్యను బెడ్ కాఫీ లేదా టీ తో మొదలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఉదయాన్నే పరగడుపున వాటిని తాగితే ఆరోగ్యం కలగకపోగా పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే వాటికి బదులుగా ఒక గ్లాస్ మజ్జిగను ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎంతో మేలు కలుగుతుంది. ఇలా మజ్జిగ తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగుతుంటే కేవలం కొద్ది రోజుల్లోనే వచ్చే మార్పును గమనించవచ్చు.
ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. వాటిల్లో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.
మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తాగితే ఎలాంటి పొట్టైనా, శరీరంలో అధికంగా ఉండే కొవ్వయినా సులువుగా కరుగుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
ఉదయాన్నే పరగడుపునే కాదు, భోజనం చేశాక అసౌకర్యంగా ఉంటే ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది.
నిత్యం వేడి వాతావరణంలో పని చేసే వారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగి బయటికి వెళితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
విరేచనాలు అవుతున్న వారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీస్పూన్ అల్లం రసం కలిపి తాగాలి. విరేచనాలు తగ్గుముఖం పడతాయి.
హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుంది.

Loading...

Latest Posts