అమ్మాయిల షర్ట్స్ కు పాకెట్లు ఎందుకుండవో తెలుసా

మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయి షర్టులకు పాకెట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఇటీవలి కాలంలో మీరు గమనిస్తే అమ్మాయిల షర్టు లకు మాత్రం పాకెట్లు (జేబులు) ఉండవు. కాని అలా ఎందుకు ఉండవు అని సాధారణంగా కొందరికి సందేహం రావొచ్చు. అబ్బాయిలు షర్టులను కుట్టించుకునేందుకు టైలర్ కి ఇస్తే పాకెట్స్ లేకుండా కుట్టకుండా ఉండరు. ఈ మధ్య కాలంలో పాకెట్ ఉంది పాకెట్ లేకుండా రెండు రకాలుగా వాడుతున్నారు. అయితే అమ్మాయిల షర్టు కి పాకెట్స్ ఎందుకు ఉండదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
అమ్మాయిలు ఫ్యాషన్ కు సింబల్ గా షర్టు అని ఎక్కువ మంది చెప్పారు. అయితే వాటికి పాకెట్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా చిన్నగా ఉంటుంది. అందులో వారికి అవసరమయ్యే వస్తువులు పట్టవు. అందుకే వారు పాకెట్ లేని షర్టు వేసుకోవడానికే ఇష్టపడుతున్నారట. ఒకవేళ పాకెట్ ఉండి అందులో ఏమైనా పెట్టుకుంటే ఫిజికల్ గా ఇబ్బంది పడుతారు. ఒకవేల పెట్టుకున్న అబ్బాయిల చూపంత అక్కడే ఉంటుంది అని ఎక్కువగా పెట్టుకోరు. అబ్బాయిల మాదిరి అమ్మాయిలు కూడా చొక్కాలు ధరించడం మొదలు పెట్టిన కొత్తల్లో వాటికి ఖచ్చితంగా రెండు జేబులు ఉండేవి. కాని అవి వారికి యూజ్ లెస్ అవడమే కాకుండా ఎబ్బెట్టుగా కూడా ఉన్నాయి. పైగా వాటిని ఎవరూ వాడడంతో తర్వాతి కాలంలో వచ్చిన లేడీస్ షర్ట్స్ కు పాకెట్స్ తీసేశారు.

Popular Posts

Latest Posts