భర్త డ్రైవ‌ర్ కావ‌డంతో ఇంటి ద‌గ్గ‌ర ఉండేవాడు కాదు దీంతో మరిది కన్ను వదినపై పడింది

చిరిగిన దుస్తుల‌తో ఆమె నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుంది. జ‌రిగిన ఘాతుకాన్ని పోలీసుల‌కు వివ‌రించింది. ఆమె చెప్పిన విష‌యాన్ని విన్న పోలీసులు నిర్ఘాంత‌పోయారు. దీనికి కార‌ణ‌మైన ఆమె మ‌రిదిని అరెస్టు చేశారు.

ఆగ్రాలో నివ‌సిస్తోంది బాధిత మ‌హిళ‌. బాధిత మ‌హిళ త‌న భ‌ర్త సురేంద్ర‌తో క‌లిసి న్యూ ఆగ్రా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఇంద్ర‌పురిలో నివ‌సిస్తోంది. సురేంద్ర‌ డ్రైవ‌ర్‌. సురేంద్ర‌ త‌ర‌ఫు బంధువులు కూడా అదే ప్రాంతంలో నివ‌సిస్తుంటారు. సురేంద్ర‌ సోద‌రుడి వ‌ర‌సయ్యే యువ‌కుడు రోజూ ఆమె ఇంటికి వ‌చ్చి వెళ్తుంటాడు. సురేంద్ర వృత్తిరీత్యా డ్రైవ‌ర్ కావ‌డంతో ఇంటి ద‌గ్గ‌ర ఉండే సంద‌ర్భాలు త‌క్కువ‌. ఈ క్ర‌మంలో సురేంద్ర సోద‌రుడు గౌత‌మ్ క‌న్ను బాధిత మ‌హిళ‌పై ప‌డింది. సురేంద్ర ఇంట్లో లేని స‌మ‌యంలో మ‌ద్యం సేవించి వ‌చ్చిన గౌత‌మ్.. బాధిత మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించాడు. ఆ త‌రువాత ఈ క్లిప్పింగ్‌ను అడ్డు పెట్టుకుని.. ఆమెను లొంగ‌దీసుకున్నాడు. సుమారు మూడు నెల‌లుగా బాధిత మ‌హిళ‌పై లైంగిక దాడికి పాల్ప‌డుతూ వ‌చ్చాడు. పైగా మ‌ద్యం సేవించ‌డానికి డ‌బ్బులు కూడా అడిగేవాడు. అత‌ని బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిన బాధిత మ‌హిళ ఇప్ప‌టికే 25 వేల రూపాయ‌ల‌ను అత‌నికి స‌మ‌ర్పించుకుంది.

ఆదివారం మ‌ధ్యాహ్నం కూడా సురేంద్ర ఇంట్లో లేని స‌మ‌యంలో వ‌చ్చి అత్యాచారం చేశాడు. డ‌బ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వ‌క‌పోతే కొట్టేవాడ‌ట‌. రోజురోజుకూ గౌత‌మ్ వేధింపులు తీవ్రమౌతుండ‌టంతో..ఆమె అదేరోజు సాయంత్రం చిరిగిన దుస్తుల‌తోనే నేరుగా న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్‌కు వ‌చ్చింది. త‌న దుస్థితిని పోలీసుల‌కు వివ‌రించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు గౌత‌మ్‌ను అరెస్టు చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)