పుట్టబోయే పిల్లలు అందంగా, తెలివిగా పుట్టాలంటే గర్భంతో ఉన్నప్పుడు ఈ 4 పనులు చేస్తే చాలు

తమకు పుట్టబోయే పిల్లలు చాలా అందంగా, మంచి తెలివితేటలతో పుట్టాలని కోరుకోవడం తప్పేమీ కాదు. గర్భంతో ఉన్నప్పుడు మంచి పోషక ఆహారం తీసుకోవడం వలన మీకు, మీ బిడ్డకు ఎంత ప్రయోజకరమో ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే పోషక ఆహారంతో పాటు ఇక్కడ చెప్పుకోబోతున్న పనులు చేయడం వలన మీ పిల్లలు చక్కటి తెలివి తేటలతో జన్మిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

1) చక్కని సంగీతం వినండి - అవును గర్భంతో ఉన్నప్పుడు మీరు చక్కటి సంగీతం వినడం వలన మీ కడుపులోని బిడ్డ సంతోషిస్తారు. చక్కనైన సంగీతం వినడం వలన సెరోటోనిన్ అనే రసాయనం విడుదలను ప్రేరేపిస్తుంది. అలాగే మీరు కూడా పాట పాడటం వలన బిడ్డ మరింత సంతోషిస్తారు. మీ కడుపుకు దగ్గరగా హెడ్ ఫోన్స్ కొద్దిసేపు ఉంచి వినిపించడం వలన మీ బిడ్డకు ఆనందం కలగడమే కాకుండా బ్రెయిన్ పవర్ కు బాగా ఉపయోగపడుతుంది.

2) కడుపుపై చేతులతో మసాజ్ చేయండి
- మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ రెండు చేతులను తీసుకుని మీ గర్భంపై ఉంచి సున్నితంగా మసాజ్ లా చేయడం వలన మీ బిడ్డను తాకిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ విధంగా చేయడం వలన కడుపులోని బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది మరియు బ్రెయిన్ కు మంచిది కూడా. ఇలా చేతులతో మర్దనా చేయడం వలన వారికి కావలసిన పోషకాలు ఏ స్థాయిలో కావాలో అంత పొందగలరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3) సూర్య కాంతి తాకేలా చూసుకోవాలి - ప్రగ్నన్సీ సమయంలో తప్పక చేయాల్సిన పనులలో ఇది ఒకటి. గంటలు గంటలు సూర్యకాంతిలో తిరగవలసిన అవసరం లేదు. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం 20 నిముషాల పాటు సూర్యకాంతిలో నడుస్తూ వెళ్లడం లేదా కూర్చున్నా సరే విటమిన్ డి అందుతుంది. ఇది మీకే కాకుండా మీ బిడ్డ ఎముకల పెరుగుదలకు మరియు పిండ అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది.

4) ఇలా వ్యాయామం చేయండి - ప్రగ్నన్సీ సమయంలో చేయవలసిన సులువైన వ్యాయామాలు ప్రతి రోజూ చేయడం వలన ఒత్తిడి, ఆందోళన ఉండదు. లావు పెరగకుండా కంట్రోల్ లో ఉండవచ్చు. డెలివరీ సమయంలో సులభంగా సహజ డెలివరినే జరుగుతుంది. ఉదయం అలసట, వికారం ఉండదు. ఎక్సర్ సైజెస్ చేయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి బిడ్డ బ్రెయిన్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

ఇది ప్రతి తల్లి తప్పక చేయాలి - మీకు తెలుసో లేదో గానీ మీ గర్భంలో ఉన్న పిల్లలకు బయట జరిగే విషయాలను గ్రహించే శక్తి ఉంటుంది. ఏదైనా మాట్లాడినా వారికి వినిపిస్తుంది. మీరు ప్రకృతిని ఆస్వాదిస్తుంటే వారు ఆనందించగలరు. మీరు సంతోషంగా ఉంటే సంతోషంగా, కోపంగా ఉంటే బాధపడటం అన్ని వారికి తెలుస్తాయి కాబట్టి, అందుకని మీ కడుపుపై రెండు చేతులు ఉంచి మీ బిడ్డతో మాట్లాడండి, మీ ఆయనకు చెప్పండి. ఇలా చేస్తే మీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీతో ఎవరు చెప్పి ఉండరు కదా.. అందుకే అందరికీ SHARE చేయండి.

Popular Posts

Latest Posts