తొందరగా చచ్చిపోవాలంటే నూడుల్స్ బాగా ఉపయోగపడతాయి

Loading...
నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎక్కువగా లాగించేస్తున్నారు. మార్కెట్‌లో అనేక రకాల కంపెనీలకు చెందిన నూడుల్స్ మాత్రమే కాదు, లూజ్‌గా కూడా మనకు అవి లభిస్తున్నాయి. దీంతో చాలా మంది వాటిని ఏకంగా ఇండ్లలోనే తయారు చేసుకుని మరీ తింటున్నారు. అయితే ఎలా తిన్నా, ఏ నూడుల్స్ తిన్నా అవి మన ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు వైద్యులు. మరి నూడుల్స్ వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అధిక బరువు సమస్యతో బాధపడే వారు నూడుల్స్ అస్సలు తినకూడదు. తింటే బరువు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ అస్సలు ఉండదు. నూడుల్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితా కిందకు వస్తాయి. కనుక వీటిని తింటే ఫైబర్ ఏ మాత్రం అందకపోగా వీటి వల్ల మన శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. అది కొవ్వుగా మారి అధిక బరువుకు కారణమవుతుంది.

2. నూడుల్స్ రెగ్యులర్‌గా తినే వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వస్తే శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయలేదు. జీవక్రియలు మందగిస్తాయి. ఫలితంగా థైరాయిడ్ గ్రంథుల పనితీరుపై ప్రభావం పడుతుంది. బరువు పెరుగుతారు.

3. నూడుల్స్‌ను మైదాతో తయారు చేస్తారు. అందువల్లో వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. కనుక ఇది జంక్ ఫుడ్డే అవుతుంది. దీంతో నూడుల్స్‌ను తింటే మనకు ఎలాంటి లాభాలు కలగవు. ఒక వ్యర్థ పదార్థాన్ని తిన్నట్టే అవుతుంది.

4. నూడుల్స్‌లో మన శరీరానికి చెడు చేసే కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బులను తెచ్చి పెడతాయి.

5. నూడుల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి అధిక మోతాదులో చేరితే ఫలితంగా బీపీ, తలనొప్పి, వికారం, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయి.

6. నూడుల్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అది ఒంట్లో అధికంగా నీరు చేరేందుకు కారణమవుతుంది. దీంతో పాదాలు, చేతులు ఉబ్బినట్టు వాపులు వస్తాయి.

7. నూడుల్స్ తిని ఇతర ఆహారాలు తింటే వాటిల్లో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా నూడుల్స్ అడ్డుకుంటాయి. దీంతో పోషకాహార లోపం వస్తుంది.

8. గర్భిణీలు నూడుల్స్‌ను అస్సలు తినకూడదు. తింటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

9. నూడుల్స్‌లో ప్రొపైలెన్ గ్లైకోల్ అనే పదార్థం ఉంటుంది. ఇది నూడుల్స్‌ను పొడిగా ఉంచుతుంది. తేమను చేరనివ్వదు. అయితే ఈ పదార్థం మన శరీరంలో చేరితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...