పూజలో అగరువత్తులు వెలిగించడానికి సైన్సు చెబుతున్న అద్భుతమైన నిజాలు ఇవే

పూజలో అగరవత్తులను వెలిగించడం సర్వసాధారణం. ఈ సంప్రదాయాన్ని మతపరమైన వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాటిస్తారు. అయితే ఇందులోనూ శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. పురాతన భారతీయ సంప్రదాయంలో అగరవత్తులను వెలగించడం వల్ల గది మొత్తం సువాసన ఆవరిస్తుంది. పురాణ కాలంలో వినియోగించే అగరవత్తుల్లో అనేక ఔషధ పదార్థాలు ఉండేవి. ముఖ్యంగా గుగ్గిలం, సాంబ్రాణిలను వీటిలో అత్యంత విరివిగా వినియోగించేవారు. నేటికాలంలోనూ వీటిని వాడుతున్నారు. సాంబ్రాణిని బోస్విలియా చెట్టు లభించే జిగురు నుంచి తయారుచేస్తారు. దీని నుంచి వెలువడే సువాసన మెదడులోని టీర్పీవీ3 అనే ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుంది. చర్మం కింద మృదుస్పర్శకు అవసరమైన స్రావాలను ఈ ప్రొటీన్ విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది.

గుగ్గిలం గురించి అథర్వణ వేదంలోనూ వివరించారు. గుగ్గిలం చెట్ల నుంచి మండు వేసవిలో లభించే జిగురు ద్వారా దీన్ని తయారుచేస్తారు. ఇది క్రిమిసంహారిగానే కాదు, రక్తస్రావాలను నివారించే గుణాలను కూడా కలిగి ఉంది. వీటితో తయారుచేసిన అగరవత్తులను వెలిగించినప్పుడు గాలిలో కలుషితాన్ని శుద్ధిచేస్తుంది. అగరవత్తులు మండుతున్నప్పుడు వెలువడే తాజా సువాసన వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఏకాగ్రత కలుగుతుంది. అందుకే పూజలో వీటిని తప్పనిసరిగా వెలిగిస్తారు. అలాగే వాస్తు ప్రకారం కూడా మేలు కలుగుతుంది. అగరవత్తులు వెలిగించినప్పుడు వెలువడే సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాల్లో సానుకూలత వ్యాప్తి చెందుతుంది. ఏదైనా హానికారక శక్తులుంటే వాటిని తటస్థంగా చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)