మూఢనమ్మకాల మీద అలుపెరగని పోరాటం చేస్తున్న బాబు గోగినేని. ఇలాంటి వ్యక్తి ఊరికి ఒక్కరున్న మనదేశం ఎప్పుడో బాగుపడేది

Loading...
ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాలకు చెందిన వారున్నారు. వారంతా తమ మతానికి అనుగుణంగా ఆయా విశ్వాసాలను, ఆచారాలను పాటిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పలువురు పాటించే విచిత్రమైన ఆచారాలు మూఢనమ్మకాలను తలపిస్తాయి. దీంతో అలాంటి వాటి బారిన పడి ప్రజలు అన్నింటినీ కోల్పోతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ఇలాంటి మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తారు. దాంతో వారు లాభపడతారు. కానీ అమాయక జనాలు మాత్రం నష్టపోతారు. ఇది ఎక్కడైనా జరుగుతున్నదే. మన దేశంలో ఇది ఇంకొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే అలా మూఢ నమ్మకాల బారిన పడి ప్రజలు నష్టపోకుండా, ఏది నిజం, ఏది అబద్దం అనే సత్యాన్ని చెబుతూ వారిని ఆ మార్గం నుంచి వేరే మార్గం వైపు మళ్లిస్తున్నారు కొందరు. అలాంటి కొందరు వ్యక్తుల్లో గోగినేని బాబు కూడా ఒకరు. ఈయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి చివరి వరకు చూడండి.
గోగినేని బాబు ఎక్కువగా టీవీ షోల్లో మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. మొన్నీ మధ్యే సీవీఆర్‌ హెల్త్‌ వారు పెట్టిన ప్రాణ చికిత్స అనే లైవ్‌కు ఏబీఎన్‌ చానల్‌లో గోగినేని బాబు సదరు చికిత్స చేసే అతనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఇదే కాదు.. ఇంకా ఇలాంటి ఎన్నో మూఢ నమ్మకాలను కుండ బద్దలు కొట్టి అవి అబద్దమని నిరూపించి చాలా మంది కళ్లు తెరిపించారు ఈయన. గోగినేని బాబు నిజానికి ఇప్పుడు కాదు ఆయన చిన్నప్పటి నుంచే మానవతా భావాలను కలిగి ఉన్నారు. ఎప్పుడూ నాస్తికుడుగానే జీవించారు. ఎంఎన్‌ రాయ్‌ పుస్తకాల ప్రభావం ఈయనపై ఎక్కువగా ఉండేది. మనం జీవిస్తున్నదే నిజం, భగవంతుడు లేడు, జనం ఇది తెలియక అంతా భగవంతుని శక్తి అని జీవిస్తున్నారు, కానీ ఉన్నది మొత్తం సైన్సే, దాన్ని జనాలకు తెలిసేలా చేస్తా.. అంటూ బాబు ముందుకు సాగుతున్నారు. ఈయన తండ్రి రైతు. వ్యవసాయమే ఆయన ఆధారం. అది చేస్తూనే బాబును గొప్పగా చదివించాలని అనుకున్నారు. అయితే బాబు డిగ్రీలో మైక్రో బయాలజీ పూర్తి చేశారు. అనంతరం ఫ్రెంచ్‌, జర్మన్‌ లాంగ్వేజెస్‌ కోర్సులను పూర్తి చేశారు. తరువాత లండన్‌లో 10 సంవత్సరాల పాటు ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌లో టీచింగ్‌ ఇచ్చారు. తన 20వ పడిలోనే బాబు టీచింగ్‌ కెరీర్‌ మొదలు పెట్టారు. అప్పట్లోనే డాక్టర్లు, లాయర్ల కన్నా 5 రెట్ల ఎక్కువ వేతనం తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్కిల్ గురు అనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దానితో పాటు ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ లాంటి లాంగ్వేజీలలో కూడా టైనింగ్ ఇస్తున్నారు.
మనమందరం ఒక ఏక కణ జీవి నుండి వచ్చాం. రెండు లక్షల సంవత్సరాల క్రితం ఒకే తల్లికి పుట్టిన మనుషలం మనం. తల్లి ఒక్కతే కానీ తండ్రులు వేరు. మైటోకాండ్రియా ఇదే చెబుతుంది. ఇంతకన్నా సైన్స్ ఆధారంగా నిరూపితమైన గొప్ప స్పిరిచువల్ లైన్ ఉండదు కాబోలు అని అంటారు గోగినేని. అయితే బాబు చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే… బాబు రెండో తరగతిలో ఉన్నప్పుడు (నర్సరీ, 1వ తరగతి చదవకుండా ఆయన నేరుగా స్కూల్‌లో రెండో తరగతిలోనే చేరడం విశేషం) ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా బాబు పక్కన ఉన్న తోటి విద్యార్ధి మాట్లాడుతూ.. పేపర్ మీద చిన్నరాయి పెట్టి రాయి ఇదొక సెంటిమెంట్ ఇలా చేస్తే నువ్వు పాస్ అవుతావు.. అని చెప్పాడట. దీనికి బాబు నేను చేయను.. అని చెప్పి మామూలుగానే ఎగ్జామ్ రాశారట. కట్ చేస్తే రిజల్ట్స్.. రాయి పెట్టి రాయనందుకు బాబుకు డబుల్ ప్రమోషన్ వచ్చేసి 4వ తరగతిలోకి వెళ్ళిపోయారు. దీంతో బాబుకు సలహా ఇచ్చిన తోటి విద్యార్థి షాక్‌..! అలా బాబు చిన్నప్పటి నుంచే ఇలాంటి సెంటిమెంట్స్‌కు, మూఢ నమ్మకాలకు దూరంగా ఉండేవారు.
ఇక మరోసారి… అవి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సి విధించిన రోజులు.. అప్పుడు తనకు ఎదురుతిరిగన వారిని అరెస్ట్ చేస్తున్నారు. గోగినేని బాబుది అప్పుడు స్కూల్ కు వెళ్ళే వయస్సు. అప్పుడు స్కూల్ కు వెళ్తూ.. నన్ను అరెస్ట్ చేయండి చూస్తా.. అని అన్నారట. ఇది బాబులో ఉన్న తెగువ, ధైర్యానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఆ బుద్దుడు తన సమస్థ రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి బిక్షమెత్తుకుని ప్రజలలో ఆజ్ఞానాన్ని రూపుమాపితే ఈనాడు ఈ దొంగస్వామిజీలు పెద్ద పెద్ద రాజప్రాసాదాలను నిర్మించి అమాయక ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని బాబు అంటారు.
మన దేశంలో ఎంతో మేథో సంపత్తి ఉంది. అనేక వనరులు ఉన్నాయి. రోజు రోజుకీ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తున్నాం. అనేక రంగాల్లో సాంకేతికంగా ముందుకు సాగుతున్నాం. ఆకాశంలోకి రాకెట్లను సొంతంగా పంపుతున్నాం. అయినప్పటికీ మన సమాజాన్ని మూఢ నమ్మకాలనే జాడ్యాలు వీడడం లేదని అంటారు బాబు. పుష్కరాల సందర్భంగా నదుల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని ప్రభుత్వాలు చెబుతాయి. దాన్ని క్యాష్‌ చేసుకుంటాయి. కానీ దాన్ని నమ్మిన జనాలు మాత్రం నదుల్లోకి వెళ్తారు. అక్కడ స్నానాలు చేసి అంటు వ్యాధులను కొని తెచ్చుకుంటారు. ఇక తొక్కిసలాటలు జరిగితే ప్రాణాలు కోల్పోతారు.. అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరోవైపు న్యూమరాలజీ, జ్యోతిష్యం, రంగురాళ్లు… వగైరా అంటూ కొందరు కోట్ల రూపాయలను ప్రజల నుంచి కాజేస్తారని, కానీ వాటిల్లో విశ్వసనీయత ఉండవని, ఈ నేపథ్యంలో ప్రజలు తమ విలువైన ధనాన్ని కోల్పోతారని బాబు అంటారు. అందుకే ఇలాంటి మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలను రూపుమాపాలనే బాబు ముందుకు సాగుతున్నారు. తనకు వీలైనంత వరకు వీటి పట్ల అవగాహన కల్పించడానికే ఆయన యత్నిస్తారు.
అయితే 2001 లో బాబు అమ్మ చనిపోయింది. దీంతో విదేశాల్లో ఉన్న బాబు ఇండియాకు వచ్చి తన తల్లి అవయవాలను ముగ్గురు వేర్వేరు మతస్తులకు దానం చేశారు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా మిత్రుడే, మూడాచారాలు పాటించి నాశనమవుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను అని అంటారు బాబు. అలాగే ఓసారి పాకిస్థాన్‌లో ఆ దేశానికి చెందిన వ్యక్తి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ సభలో కామెంట్లు చేశాడు. దీంతో అతన్ని ఆ దేశ ప్రభుత్వం జైలులో వేయగా ఈ విషయం తెలుసుకున్న బాబు స్వయంగా అతన్ని రక్షించారు.
అదేవిధంగా శాంభవి అనే ఓ 7 ఏళ్ల బాలికను సన్యాసినిగా చేసి ఆమె సహాయంతో జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజాలని చూసిన స్వామీజీల ఆట కట్టించారు. నా దేశం గొప్పదేశం, నా దేశం చంద్రునిపై శాటిలైట్ ని పంపించింది. అంతటి గొప్ప దేశాన్ని చంద్రుని నీడ ను చూసి నా దేశ ప్రజలను భయపడేలా చేస్తున్నారు కొంతమంది జ్యోతిష్యులు అంటారు బాబు. ఇక గ్రహణం రోజున గర్భిణీలు బయట తిరిగితే పిల్లలు సరిగ్గా పుట్టరని ఎవరో చెప్పిన మాటలను కొందరు నమ్మి ఓ వైపు నొప్పులతో బాధపడుతున్న గర్బిణీని సూర్య గ్రహణం రోజున బయటకు తీసుకెళ్లేందుకు నిరాకరించారు. అయితే వారు గోగినేని బాబు చెప్పిన మాటలను విన్నారు. దీంతో తమ అభిప్రాయం మార్చుకుని గర్భిణీని గ్రహణం రోజున హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు పండంటి బిడ్డ జన్మించాడు. దీంతో వారి మూఢ నమ్మకం తప్పని బాబు నిరూపించారు. సత్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటాల్సి ఉంటుంది అంటారు బాబు. అవును, మరి. మన దేశంలో అలాంటి వారు ఎంత మంది ఉంటారు చెప్పండి. వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కేవలం మూఢ నమ్మకాలను నమ్మే వారే ఎక్కువ మంది ఉంటారు. అలాంంటి వారిని మార్చడమే గోగినేని బాబు పనిగా పెట్టుకున్నారు. ఆయన ఆశయం నెరవేరుతుందా? చూద్దాం..!
Loading...

Popular Posts