చిటికెన వేలుకి వెండి ఉంగరం పెట్టుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అది ఎలాగో తెలుసుకోండి.

Loading...
ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కాని ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని దండవంకీ అంటారు. ఉంగరము స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. రాశుల, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను ధరించుట భారతీయుల అలవాటు. కొన్ని ఉంగరాలకు ముత్యాలు, వజ్రాలు, పగడాలు మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది. ఉంగరాలలో కొన్ని రకాలు:- పెళ్ళి ఉంగరం, ప్రధానం ఉంగరం, వజ్రపుటుంగరం, నవరత్నాల ఉంగరం. రకాలు, వజ్రము పగడము గోమేధకము.

కొంత మంది చేతి వేలికి వెండి ఉంగరం ధరిస్తుంటారు, చేతికి వెండి ఉంగరం ధరించడం వల్ల, ముఖ్యంగా చిటికిన వేలుకు వెండి ఉంగరం ధరిస్తే అంతే మంచే జరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణలు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిటికెన వేలుకి వెండి ఉంగరం పెట్టుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి... అది ఎలాగో తెలుసుకోండి.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండికి గురుడు మరియు చంద్ర గ్రహాలతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అంతేకాకుండా ఇది శరీరంలోని నీరు మరియు కఫలను సమతుల్యతతో ఉంచుతుంది. శాస్త్రాలను గనుక పరిగణలోకి తీసుకొంటే, ఎవరైతే వెండిని కలిగి ఉంటారో వారికి అదృష్టం విపరీతంగా కలిసొస్తుందట. దీనికి తోడు వారి జీవితం ఎప్పుడూ అందంగా, ఆనందదాయకంగా కొనసాగుతుందట.

ప్రతిఒక్కరి ఇంట్లో వెండిని తమ జీవితంలో భాగంగా అలంకరణకు, వంట గదిలో లేదా ఆభరణాలుగా వేసుకోవడానికి, ఇలా వివిధ ప్రదేశాల్లో విబ్భిన్న రకాలుగా వాడటం ద్వారా మన జీవితంలో ఎన్నో సానుకూల పవనాలు వీస్తాయని, ఎంతో మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఎవరైతే ఎక్కువగా బయపడుతుంటారో లేదా బదులు ఇవ్వడంలో కొద్దిగా సమస్యలను ఎదుర్కొంటుంటారో అలాంటి వారి ఆలోచనలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వెండి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెండి ఉంగరాన్ని చిటికెన వేలుకి వేసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏంటి ? ఎలా మనకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది ? జీవితంలో సమస్యలను ఎలా అధిగమించేలా చేస్తుంది ? సమస్యలను ఎలా దూరం చేస్తుంది ? మనస్సు కు అయిన గాయాలను నయం చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది ? ఇలా అనేకమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం

మూడు అతి సాధారణ ప్రక్రియలను అనుసరించడం ద్వారా వెండి ఉంగరాన్ని ధరించండి. వెండి ఉంగరాన్ని ఆన్ లైన్ లో గాని బయట మార్కెట్ లో గాని కొనండి. ఆ కొనే రోజు గురువారమే అయ్యి ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఉంగరాన్ని కొన్న తరవాత ఒక రాత్రి మొత్తం నీటిలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా కొత్త శక్తి అందులోకి వస్తుంది. మరుసటి రోజు పూజ మందిరంలో ఆ ఉంగరాన్ని పెట్టి పూజ చేయండి లేదా ఆ ఉంగరంతో ధ్యానం చేసి మీకు నచ్చిన విధంగా ఉపయోగపడేలా ఆ ఉంగరాన్ని మలుచుకోండి.

దీని తర్వాత ఆ ఉంగరాన్ని చివరిగా గంధంలో ముంచండి. ఇలా చేయడం ద్వారా కొన్ని శక్తులు ఆ ఉంగరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మీ కుడి చేతి చిటికెన వేలుకి ఈ ఉంగరాన్ని ధరించండి. ఇలా ఆ ఉంగరాన్ని వేసుకున్న తర్వాత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, వాటిని మీరు కూడా గుర్తిస్తారు.

వెండి ఉంగరాన్ని వేసుకోవడం వల్ల కలిగే సానుకూలమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీ యొక్క ఆనందం మరియు వ్యక్తిత్వం ఎంతగానో పెరుగుతుంది మరియు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వెండికి గురుడు మరియు చంద్ర గ్రహాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీలో ఉన్న కోపాన్ని తగ్గిస్తుంది మరియు మీ మెదడులో అలజడులు లేకుండా చేస్తుంది

చంద్రుడు బలహీనంగా గనుక ఉంటే, అప్పుడు అది ఆ వ్యక్తి మానసిక స్థితి పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది మరియు ఆ వ్యక్తి కూడా బలహీనుడిగా మారిపోతాడు. చంద్రుడిని శక్తివంతంగా మార్చే ఒక అతీతమైన శక్తి వెండి ఉంగరానికి ఉంది. దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు మరియు ఇంకా కొన్ని అనారోగ్య సమస్యల భారి నుండి కాపాడి సహజ సిద్ధంగా చికిత్సను అందించడంలో వెండి కీలకపాత్ర పోషిస్తుంది.

మీకు గనుక వెండి ఉంగరాన్ని ధరించడం ఇష్టం లేకపోతే, వెండి గొలుసుని ధరించవచ్చు. అది సున్నితంగా చాలా అందంగా ఉంటుంది. వెండి ఉంగరం ఎలాంటి ప్రభావం అయితే చూపిస్తుందో అలాంటి ప్రభావాన్నే వెండి గొలుసు కూడా చూపిస్తుంది. ఇది మీ గొంతులో ఉండే చక్రానికి విపరీతమైన శక్తి ఇస్తుంది. మంచి ఆలోచనతో, తగిన రీతిలో గనుక వెండి గొలుసు ధరిస్తే నత్తిగా మాట్లాడటాన్ని మరియు మాట్లాడేటప్పుడు ఎదురయ్యే వివిధరకాల సమస్యలను అధిగమించేలా చేస్తుంది.

మనం ఇంత వరకు వెండి ఉంగరం మరియు వెండి గొలుసు గురించి మాట్లాడుకున్నాం. వెండి పాత్రల గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్తిగా ముగించినట్లవుతుంది. వెండి పాత్రలు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వాటికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. తేనెని వెండి గిన్నెలో వేసుకొని వెండి స్పూన్ తో గనుక సేవించినట్లైతే సైనస్ మరియు జలుబు వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇలా వెండి లోహాన్ని ప్రతిరోజు మన దైనందిక జీవితంలో వాడటం వల్ల ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా మరియు ఆరోగ్యంగా తమ జీవితాన్ని గడుపుతారు.
Loading...

Popular Posts