ఉడకపెట్టిన గుడ్లు ఎంత సేపట్లో తినాలో తెలుసా ? నిజానికి ఉడికిన గుడ్లను వెంటనే తినాలి అందరూ తప్పక తెలుసుకోవాలి

కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కూర లేదా ఫ్రైగా చేసుకుని తినే కన్నా ఉడకబెట్టుకుని తింటేనే గుడ్లలో ఉండే పోషకాలు మనకు ఎక్కువగా అందుతాయి. అదే గుడ్లను తినేందుకు శ్రేయస్కరమైన పద్ధతి కూడా. అయితే కోడిగుడ్లను ఉడకబెట్టాక చాలా సమయం పాటు అలాగే ఉంచి కొందరు తింటారు. నిజానికి గుడ్లను అలా పెట్టకూడదు. ఉడికిన గుడ్లను వెంటనే తినాలి. అందుకు ఎంత వరకు ఆగవచ్చంటే..?

ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకపోతే ఒక గంటలోపల తినేయాలి. కానీ అంతకు మాత్రం సమయం మించకూడదు. ఎందుకంటే ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్‌లు త్వరగా చేరి అవి కంటామినేట్ అవుతాయి. కనుక ఉడికిన గుడ్డును ఒక గంటలోపే తినాల్సి ఉంటుంది. ఇక బాయిల్డ్ ఎగ్స్‌ను పొట్టుతో అలాగే ఫ్రిజ్‌లో పెట్టేటట్టయితే రెండు రోజుల వరకు వాటిని నిల్వ ఉంచవచ్చు. పొట్టు తీసిన బాయిల్డ్ ఎగ్స్‌ను 24 గంటల  వరకు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చు. అయితే బాయిల్డ్ ఎగ్స్‌ను ఫ్రిజ్‌లో పెడితే గాలి చొరబడని టైట్ కంటెయినర్‌లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో బాయిల్డ్ ఎగ్స్ పాడవకుండా ఉంటాయి.

Popular Posts

Latest Posts