ఆంజనేయస్వామిని సంకెళ్ళతో కట్టేసి ఉంచిన దేవాలయం

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రాలలో జగన్నాథదేవాలయం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్నే దరియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు. సాధారణంగా దరియా అంటే సముద్రం అని అర్థం. అంటే మహావీరుడైన హనుమంతుడు సముద్రం నుండి ఆ నగరాన్ని కాపాడుతున్న మహానుభావుడు అని అక్కడ వున్న ప్రజల నమ్మకం. ఆంజనేయస్వామి సంకెళ్ళతో బంధించాడనటానికి ఇక్కడి స్థలపురాణమేమంటే, ఒకప్పుడు జగన్నాథుడు ఈ పుణ్య క్షేత్రంలో వెలసిన అనంతరం అతని దర్శనం కోరి సముద్రదేవుడు ఈ దేవాలయాన్ని సందర్శించెను. 

ఆ సమయంలో సముద్రంలోని నీరు ఈ ప్రదేశమంతా వ్యాపించి అపారహాని జరిగింది. ప్రజలు దీని గురించి జగన్నాథుడిని ప్రార్ధించారు. జగన్నాథుడు రక్షకుడైన ఆంజనేయుడు గురించి విచారించినప్పుడు హనుమంతుడు తన అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్లు తెలుసుకున్నాడు. దీని వలన ఆగ్రహించిన జగన్నాథుడు, ఈ క్షేత్రాన్ని పగలు-రాత్రి కాపలా కాచే బాధ్యతను మరిచిపోయాడని భావించి ఆంజనేయస్వామి యొక్క కాళ్ళుచేతులను పగ్గంతో కట్టి వేసి ఇకముందు ఇక్కడే సదా వెలసివుండు, ఈ క్షేత్రానికి సముద్రపు నీరు దరిచేరకుండా కాపలాకాయాలని చెప్పెను. ఈ విధంగా హనుమంతుణ్ణి "బేడి హనుమంతుడు" అని పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం ఈ స్థలం సముద్రతీరం దగ్గర వుంటే కూడా ఎటువంటి తుఫాను సంభవించినా కూడా సముద్రపు నీరు దరిచేరలేదని చెప్పవచ్చును.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)