12 ఏళ్ల వయసులో బ్రిటీషర్లకు ఎదురుతిరిగిన తీరు తెలిస్తే ఖచ్చితంగా సూపర్ అంటారు

అమాయక గ్రామస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో 1938 అక్టోబర్ 10న రాత్రి 8 గంట సమయంలో ప్రజామండల్ కార్యకర్తలు ఒడిశాలోని భుబాన్ పోలీస్ స్టేషన్ బయట నిరసన చేపట్టారు. వీరిపై బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడి జనం కోపంతో రగిలిపోయారు. వారిని అదుపు చేయడం కష్టం కావడంతో పక్కనే ఉన్న నీలకంఠాపుర్ ఘాట్ నుంచి బ్రాహ్మణి నది మీదుగా దగ్గర్లోని దేన్‌కనల్ సిటీ నుంచి అదనపు బలగాల్ని రప్పించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న బ్రిటిష్ బలగాలు అర్ధ రాత్రి వేళ బ్రాహ్మణి నది దాటేందుకు నీలకంఠాపూర్ ఘాట్‌కు వచ్చాయి. అక్కడే పడవలో నిద్రిస్తోన్న 12 ఏళ్ల బజీ రౌత్‌ను నిద్ర లేపాయి. బ్రిటిష్ సైన్యం తమను బ్రాహ్మణి నది దాటించాలని బజీని ఆదేశించింది. జీవనోపాధి కోసం పడవ నడిపే బజీ.. వయసులో చిన్నవాడే అయినప్పటికీ దేశభక్తి, గుండె ధైర్యం ఎక్కువ.

బ్రిటిష్ సైనికులను నది దాటిస్తే.. ఎంతో మంది అమయాకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. వారిని నది దాటించకపోతే అవతలి ఒడ్డుకు చేరలేరనే ఉద్దేశంతో బజీ అందుకు ఒప్పుకోలేదు. దీంతో చంపేస్తామని బ్రిటిష్ సైనికులు బెదిరించారు. కానీ అతడు మాత్రం వారి మాటల్ని లక్ష్యపెట్టలేదు. బజీ తీరుతో కోపం వచ్చిన ఓ బ్రిటిష్ సైనికుడు తుపాకీతో అతడి తలపై గట్టిగా మోదాడు. కుప్పకూలిన ఆ కుర్రాడు కాసేపటికి తేరుకునే మరింత బలంగా తన గొంతు వినిపించాడు. నేను బతికి ఉండగా.. మిమ్మల్ని నది దాటనివ్వను అని చెప్పాడు. ఆ కుర్రాడి తెగువ చూసిన సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ చూస్తుండగానే ఒకడు తుపాకీ బ్యానెట్‌తో బజీ తలపై గుచ్చాడు. బాలుడనే కనికరం లేకుండా మరొక సైనికుడు తుపాకీతో కిరాతకం కాల్చాడు. దీంతో ఆ పిల్లాడు ప్రాణాలు వదిలాడు. బజీతోపాటు అతడి స్నేహితులైన లక్ష్మణ్ మాలిక్, ఫగూ సాహూ, హ్రుషి ప్రధాన్, నటా మాలిక్‌ను కూడా బ్రిటిషర్లు పొట్టబెట్టుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)