రోజుకి మూడుసార్లు రంగులు మార్చే శివలింగం. ఇది ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయం

ఇప్పటివరకు శివలింగాలను నల్లని రూపంలో, తెల్లని మంచు రూపంలో (అమర్నాథ్ లో మాత్రమే) చూసివుంటాం. మరి రంగురంగుల శివలింగం గురించి మాటేమిటి ? ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సందేహపడకుండా చెప్పవచ్చు .. ఇది ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయం అని. ఇంకెందుకు ఆలస్యం, రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి రాజస్థాన్ వెళదాం పదండి !

మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విచిత్ర రహస్య ఆలయాల గురించి చదివాం. కానీ రోజుకి మూడుసార్లు రంగులు మార్చే శివలింగం గురించి విన్నారా? ఆగండి, దాని గురించే చెప్పబోతున్నాం… రాజస్థాన్ లోని ఢోల్ పూర్ లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం గురించే మాట్లాడుతున్నాం. ఇది రోజుకి మూడుసార్లు రంగులు మారుస్తుంది. నమ్మబుద్ధి కావట్లేదా ? చదవండి. 


ఈ గుడి మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గర్లో రాజస్థాన్ లో ఉంది. ఈ మధ్య మరింత ప్రాచుర్యం పొందుతోంది. ఈ గుడి చంబల్ ప్రాంత శివార్లలో ఉంది, అందుకని వెళ్ళటం కొంచెం కష్టమే. కానీ ఈ మధ్య చాలా ప్రసిద్ధి చెందటంతో జనాలు కోకొల్లలుగా వస్తున్నారు. పరమశివుని బొటనవేలిని పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఇక్కడ ఉన్న నంది మొత్తం ఇత్తడితో చేయబడింది. ఈ గుడి 2500 ఏళ్ళ క్రితందని, ఇక్కడి పరమశివుని బొటనవేలు ప్రపంచాన్ని సరిగ్గా ఉంచుతుందని విశ్వసిస్తారు. 

ఈ గుడిలో 3 రాతి గేదెలు దగ్గరలో ఉన్న సరస్సు వద్ద ఉన్నాయి. వివివిధ కథనాల ప్రకారం, అచలేశ్వర్ గుడి పరమశివుని బొటనవేలి చుట్టూ 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శివలింగం ఆ ప్రాంత గొప్పదైన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబిస్తూ, సహజంగా ఉంటుంది. ఈ గుడి అనేక అద్భుతాలకి నిలయం- ముస్లిం దాడులు జరిగినప్పుడు ఈ గుడిలో ఉన్న నంది వేలకొలదీ తేనెటీగలను వారి మీదకి వదిలిందని అంటారు. పురాతత్వవేత్తలు ఒకసారి శివలింగ లోతు కనుగొందామని ప్రయత్నించగా, ఒకరోజు మొత్తం ప్రయత్నించినా వారు తెలుసుకోలేకపోయారట. అందుకని ఇక ఆ ప్రయత్నం మానేసారు. 

శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం శివలింగం యొక్క రంగులు సూర్యకాంతి వలన వస్తాయి అని. కానీ దీన్ని నిర్థారించే పరిశోధన ఏమీ జరగలేదు. పొద్దునపూట శివలింగం ఎర్రగా ఉంటుంది, మధ్యాహ్నం కల్లా కాషాయ రంగులోకి మారిపోతుంది. రాత్రికల్లా శివలింగం రంగు నల్లగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ వింతను చూడటానికి వస్తారు. శివలింగం ఎలా పుట్టిందో, ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. శాస్త్రవేత్తలను కూడా ఇది ఆశ్చర్యపరిచింది. శివలింగానికి అద్భుతశక్తులున్నాయనే నమ్మకం ఉంది. ఈ గుడిలో ప్రార్థించిన వారందరికీ వారి కోరికలు తప్పక ఫలిస్తాయని భావిస్తారు. పెళ్ళికాని యువతీయువకులు, భాగస్వామి దొరకనివారు ఈ గుడికి వచ్చి పెళ్ళాడతారు. 

ఇది ఇలా ఉంచితే, మనం మరొక వింతైన శివాలయం గురించి తెలుసుకుందాం. ఈ దక్షిణముఖ నంది తీర్థకల్యాణి క్షేత్రం బెంగుళూరులో ఉంది. ఇది కూడా దేశంలో ఇటీవల ప్రాచుర్యం పొందిన వింతైన రహస్య ఆలయం. ఈ ఆలయం నిలబడిన భూభాగంలో పురాతత్వవేత్తలు 1967లో ఒక ఎద్దును కనుగొన్నారు. అప్పుడు ఆర్కియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరింత పరిశోధన బాధ్యతను చేపట్టింది. పురాతత్వశాఖ వారు ఈ గుడి 400 ఏళ్ళ క్రితం నాటిదని తేల్చారు. నందితో పాటు వారు శివలింగం మరియు ఒక కొలను కూడా ఆ ప్రాంతంలో కనుగొన్నారు. పురాతత్వశాఖ వారు ఆ ప్రాంతాన్ని పరిశోధించినప్పుడు, నంది నోటి నుంచి నీరు ధారాపాతంగా ప్రవహించిందంట. ఇక అప్పటి నుంచి ఆ గుడిని చాలా మహిమలు కలదిగా పూజిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)