పెళ్లయ్యాక ఎన్నేళ్లకు పరాయి వ్యక్తుల మీద ఆసక్తి పెరుగుతుందనే విషయం మీద పరిశోధన

దాంపత్యం సాఫీగా సాగాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఎంతో అవసరం. భాగస్వామి పట్ల విశ్వాసం కోల్పోతే ఆ బంధం నిలబడదు. ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉన్నా.. కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. పెళ్లయ్యాక ఎన్నేళ్లకు భార్యాభర్తలు ఒకరినొకరు చీట్ చేసుకునే విషయమై ఓ పరిశోధన నిర్వహించారు. ఏ టైంలో పరాయి వ్యక్తుల మీద ఆసక్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ పరిశోధన వెల్లడించింది.

ఆడవాళ్లు తమ భాగస్వామిని చీట్ చేసే టైం, మగాళ్లు తమ భార్యను కాదని మరొకరితో అక్రమ సంబంధం నెరిపే సమయం వేర్వేరని ఆ పరిశోధన తెలిపింది. ఆడవాళ్లు పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ.. ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య భర్తను చీట్ చేసే అవకాశాలు ఎక్కువని తెలిపింది. ఆడవాళ్లు ఇలా చేయడానికి కారణం పిల్లల పెంపకం వల్ల కలిగే ఒత్తిడి, మధ్య వయసులో ఉండటం కారణమని స్పష్టం చేసింది. వివాహమైన కొత్తలో, పదేళ్ల తర్వాత మాత్రం ఆడవాళ్లు అలాంటి వ్యవహారాల జోలికి వెళ్లడానికి ఇష్టపడటం లేదని సదరు అధ్యయనంలో వెల్లడైంది. భర్తతో నిజాయతీతో మెలగడానికే వారు ఇష్టపడుతున్నారని చెప్పింది. ఇంట్లో ఉండే వాళ్లతో పోలిస్తే.. ఉద్యోగం చేసే వారు పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకునే అవకాశం ఎక్కువని మరో అధ్యయనం వెల్లడించింది.

మగాళ్లు మాత్రం పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకునే అవకాశాలు ఎక్కువట. జీవితంలో సాధించని అంశాలపై కూడా అదే టైంలో ఎక్కువగా ఫోకస్ చేస్తారట. ఈ వివరాల్ని జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్‌లో ప్రచురించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)