అశ్వ‌గంధ చూర్ణం చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్న మగవారికి ఇది అద్భుతం

ప‌ని ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, హార్మోన్ స‌మ‌స్య‌లు వంటి ఎన్నో అంశాల కార‌ణంగా నేటి త‌రుణంలో చాలా మందికి సంతానం క‌ల‌గ‌డం లేదు. దీనికి తోడు రాను రాను అలాంటి వారిలో శృంగార సామ‌ర్థ్యం కూడా త‌గ్గిపోతున్న‌ది. అయితే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి అశ్వ‌గంధ చూర్ణం చాలా మేలు చేస్తుంది. దీంతో త‌యారు చేసే ప‌లు మిశ్ర‌మాల‌ను రోజూ వాడితే లైంగిక ప‌టుత్వం పెర‌గ‌డ‌మే కాదు, సంతానం క‌లిగేందుకు ఎక్కువగా అవ‌కాశం ఉంటుంది. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య పోతుంది. ఆ మిశ్ర‌మాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వంద గ్రాముల అశ్వ‌గంధ పొడి (మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది)ని తీసుకుని దానికి పావు కిలో నెయ్యి క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మానికి గాలి త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. అందుకు గాను ఏదైనా ఓ డ‌బ్బాలో దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి పాలు లేదా గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. దీంతో లైంగిక ప‌టుత్వం పెరుగుతుంది. పురుషుల్లో వీర్యం చ‌క్క‌గా ఉత్ప‌త్తి అవుతుంది. స్త్రీల‌కైతే రుతుక్ర‌మం స‌రిగ్గా అవుతుంది.

2. అశ్వ‌గంధ చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని అర‌గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి స్త్రీలు తీసుకోవాలి. ప్ర‌ధానంగా వారు రుతుక్ర‌మం అయిన 4వ రోజు నుంచి ఇలా చేయాల్సి ఉంటుంది. దీంతో వారికి పిల్ల‌లు క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదే పురుషులు ఇలా తీసుకుంటే వారిలో లైంగిక సామ‌ర్థ్యం పెరిగి వీర్యం కూడా ఉత్ప‌త్తి అవుతుంది.

3. అశ్వ‌గంధ చూర్ణాన్ని 3 లేదా 4 గ్రాముల మోతాదులో తీసుకుని, అదే ప‌రిమాణంలో చ‌క్కెర‌ను దానికి కల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి తీసుకోవాలి. దీంతో శృంగార సామ‌ర్థ్యం మునుప‌టి క‌న్నా మెరుగ‌వుతుంది.

4. అశ్వ‌గంధ చూర్ణం, నెయ్యి, చ‌క్కెర‌ల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం సేవిస్తుంటే త‌ద్వారా పురుషుల్లో వీర్య క‌ణాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. వీర్యం నాణ్యంగా కూడా ఉంటుంది. అండం ద‌గ్గ‌ర‌కు ఆ వీర్య క‌ణాలు చురుగ్గా వెళ్తాయి కూడా. దీంతో సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)