బీరకాయ షుగర్‌ వ్యాధి గ్రస్తులకి బాగా పని చేస్తుంది

బీరకాయ తినాలంటే మహా బోరుగా ఫీల్‌ అవుతారు చాలా మంది. కానీ బీరకాయ శరీరానికి చాలా మంచిది అంటున్నారు డాక్టర్లు. ఆహరంలో బీరకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే అని సలహా ఇస్తున్నారు. బీరకాయలో సహజంగా ఉండే పీచు పదార్థము వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సులువుగా జీర్ణమవుతుంది. తద్వారా మలబద్దకం, జీర్ణ సమస్యలు మాయమవుతాయి. బీరలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల మలబద్దకమే కాకుండా పైల్స్‌ ఉన్నవారికి ఔషధం లాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌ అనే పదార్థం రక్తాన్ని శుభ్ర పరిచి కంటి చూపును మెరుగు పరుస్తుంది. అంతే కాక ఇది లివర్‌, గుండె పనితీరుని మెరుగు పరచడంలో కూడా సహజసిద్ధంగా ఉపయోగపడుతుంది.

బీరకాయలో కొవ్వు శాతం తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇది చక్కటి ఆహరం. ఆకలి తీరుస్తూనే బరువు తగ్గించడంలో బీరని మించింది లేదు అంటున్నారు డాక్టర్లు. ఇక రోజూ ఒక గ్లాసు బీర జ్యూస్‌ తాగితే కామెర్ల వ్యాధి సహజంగానే తగ్గుతుంది. ఇంకా అందరికన్నా షుగర్‌ వ్యాధి గ్రస్తులకి ఇది బాగా పని చేస్తుంది. 
సర్వ రోగ నివారిణి బీరకాయ
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)