వెల్లుల్లితో ఇలా చేస్తే ఒక్క నెలలోనే ఏకంగా 6 కిలోల వరకు బరువు తగ్గుతారు

వెలుల్లిని మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. దీంతో వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. వెల్లుల్లితో చేసే ఏ వంటకం అయినా మనకు నోట్లో నీళ్లూరేలా చేస్తుంది. అయితే రుచికే కాదు ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి మనకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. గుండె సమస్యలు రావు. యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే వెల్లుల్లిని కింద చెప్పిన విధంగా ఉపయోగిస్తే దాంతో నెలలోనే ఏకంగా 6 కిలోల వరకు బరువు తగ్గుతారు. అదెలాగంటే...

పచ్చి వెల్లుల్లి రెబ్బలు 3 లేదా 4 తీసుకోవాలి. వాటిని బాగా నలపాలి. అనంతరం వాటికి ఒక టీస్పూన్ తేనె కలపాలి. అప్పుడు వచ్చే మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. నెల రోజుల పాటు కచ్చితంగా ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపున తినాల్సి ఉంటుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అయితే ఈ మిశ్రమం తీసుకుంటున్నాం కదా అని చెప్పి అతిగా తినరాదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)