సినిమా థియేట‌ర్ల గురించి చాలా మందికి తెలియ‌ని కొన్ని విష‌యాలు

సినిమా థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌డం అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. అలా చూడ‌డాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. పెద్ద హాల్‌, చ‌ల్ల‌ని గాని, డీటీఎస్ సౌండ్ లో వ‌చ్చే సినిమా… అందులో ఉండే విజువ‌ల్స్. వాటిని అంద‌రూ వీక్షిస్తారు. ఆనందిస్తారు. అయితే సినిమా థియేట‌ర్ల గురించి చాలా మందికి తెలియ‌ని ప‌లు విష‌యాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సారి మీరు థియేట‌ర్ కు వెళ్లిన‌ప్పుడు ఒక సారి వీటిపై లుక్కేయండి. మ‌రి ఆ విష‌యాలు ఏమిటో చూద్దామా..!
చిత్రంలో చూపిన‌ట్టుగా థియేట‌ర్‌లో కూర్చోండి. థియేట‌ర్‌లో 2/3 వ వంతు భాగంలో మ‌ధ్య‌లో కూర్చుంటే మీకు థియేట‌ర్ స్క్రీన్ బాగా క‌నిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అంతే కాదు, ఆ ప్లేస్‌లో సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే థియేట‌ర్‌లో సౌండ్ ఇంజినీర్లు ఆ ప్లేస్‌కు అనుగుణంగానే సౌండ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేస్తారు.

చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌లో లోప‌ల ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేయ‌రు. ఎందుకంటే ఒక్కో ఆట‌కు మ‌ధ్యలో ఉండే స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక క్లీనింగ్‌పై వారు అంత‌గా దృష్టి పెట్ట‌రు. కేవ‌లం రాత్రి పూట లేదంటే ఉద‌యాన్నే మాత్ర‌మే క్లీనింగ్ చేస్తారు. అందుక‌నే మ‌న‌కు థియేట‌ర్లు ఒక్కోసారి అప‌రిశుభ్రంగా క‌నిపిస్తాయి.
మీకు తెలుసా..? ఇప్పుడు చాలా థియేట‌ర్ల‌లో సీట్ల‌కు ఉండే హాండిల్స్‌పై ఏవైనా డ్రింక్‌లు లేదా క‌ప్‌ల‌ను పెట్టుకునేందుకు హోల్డర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది మాత్రం 1981లో. అమెరికాలో ప‌లు సినిమా హాల్స్ లో ఇలా సీట్ హ్యాండిల్స్ కు క‌ప్ హోల్డ‌ర్స్‌ను ఏర్పాటు చేయ‌డం ప్రారంభించారు. ఆ త‌రువాత ఇది ఇత‌ర దేశాల‌కు విస్త‌రించింది.
సినిమా థియేట‌ర్ల‌లో పాప్‌కార్న్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. అయితే ఒక్కోసారి అది నిలవ చేసినది కావచ్చు. సినిమా థియేట‌ర్స్ లో అమ్మే పాప్ కార్న్ బ‌యటి పాప్ కార్న్ క‌న్నా మంచి వాస‌న వ‌స్తుంది. ఎందుకంటే వారు ప‌లు రెసిపిల‌ను క‌లుపుతారు. అందుకే ఆ వాస‌న వ‌స్తుంది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. క‌నుక థియేట‌ర్ లో పాప్ కార్న్ పై ఓ క‌న్నేయండి.
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు థియేట‌ర్ల‌లో అస‌భ్య ప‌నులు చేసే జంట‌ల‌ను థియేట‌ర్ సిబ్బంది బ‌య‌ట‌కు పంపేస్తుంటారు. అలా వారానికి క‌నీసం ఒక్క‌సారి అయినా జ‌రుగుతుంద‌ట‌.

పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్ , బ‌ర్గ‌ర్‌, పిజ్జా.. ఇలా ఏ ఆహారం అయినా కొంద‌రు కోంబోల్లో తీసుకుంటారు. దీంతో డ‌బ్బు సేవ్ అవుతుంద‌ని భావిస్తారు. కానీ కోంబో ఆఫ‌ర్ లోనే డ‌బ్బు పోతుంది. సేవ్ కాదు. అందుకే ఆయా ప‌దార్థాల‌ను విడి విడిగా కొంటేనే ఎక్కువ క్వాంటిటీ వ‌స్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)