మధ్యాహ్నం తీసుకునే భోజనానికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. మధ్యాహ్నం భోజనం చేసే విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి

లంచ్ సమయంలో అంటే మధ్యాహ్నం తీసుకునే భోజన విషయంలో ఎక్కువగా తప్పిదాలు చేస్తుంటాం. ఎప్పుడూ చేసేవే కాబట్టి అవి కొందరికి తప్పులుగా కూడా అనిపించవు. కానీ, వాటి దుష్ప్రభావాలు మాత్రం శరీరం మీద పడుతాయి. ఫలితంగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనం తీసుకునే ఆహారంలో అల్పాహారం ముఖ్యమైనది అయినప్పటికీ మధ్యాహ్నం తీసుకునే భోజనానికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. 

చాలామంది లంచ్ వారు పని చేసే ఆఫీసుల్లోనే చేస్తుంటారు. భోజన విరామం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే లంచ్ టైమ్ అనేది కరెక్ట్ డిజైన్ చేయబడి ఉంటుంది. మధ్యాహ్న సమయంలో మన బాడీకి మంచి బూస్ట్ ఎనర్జి కావాలి. మధ్యాహ్నం సమయంలో మన రక్తంలో చక్కెర పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భోజనం తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యం అవుతాయి. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా మీ జీవక్రియ చురుగ్గా పని చేస్తుంది. అయితే చాలా మంది ఆ టైమ్ లో వర్క్ లో బిజీగా ఉండి సరిగ్గా తినరు. లంచ్ లో మనం తరచుగా చేసే తప్పులేంటో చూద్దాం..

మీరు తినే సమయంలో కూడా ఫోన్ ను స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు. ప్రతి మొబైల్ ఫోన్ స్క్రీన్ సూక్ష్మ జీవులకు నివాసంగా ఉంటుంది. అందువల్ల మీరు భోజనం సమయంలో ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. మీరు ఫోన్ వినియోగిస్తూ పరధ్యానంలో ఉండిపోయి అధికంగా తింటారు. అందువల్ల వీలైనంత వరకు ఫోన్లకు దూరంగా ఉండండి.

రెస్టారెంట్, హోటల్స్ ల్లో ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇక్కడ తాజాగా ఉండే ఫుడ్ ఉండదు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులుపడాల్సి వస్తోంది. అలాగే ఇక్కడ శుభ్రత కూడా సరిగ్గా ఉండదు. బయట ఫుడ్ ను ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది. చాలా తక్కువ సమయాల్లో ఇలాంటి ఫుడ్ ను తీసుకోవాలి.ఇంట్లో చేసిన ఫుడ్ ను తినడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వండి.

కొందరు వారు తినే ఆహారం మరింత రుచిగా ఉండాలని అందులో ఉప్పు ఎక్కువగా కలుపుతారు. దీంతో చాలా అనర్థాలు ఏర్పడుతాయి. దాన్ని ఫిల్టర్ చేయడానికి మీ మూత్రపిండాలు చాలా శ్రమించాల్సి వస్తుంది. వాటిపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అధిక ఉప్పు ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు కూడా తలెత్తుతాయి. అందువల్ల వీలైనంత వరకు ఉప్పుకు దూరంగా ఉండండి.

మీరు పని చేసే డెస్క్ వద్ద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. టాయిలెట్లో ఉండేదానికంటే 3 రెట్లు ఎక్కువ జెర్మ్స్ మీరు పని చేసే డెస్క్ వద్దే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు మీ డెస్క్ వద్ద వీలైనంత వరకు భోజనం చేయకండి.అక్కడ ఉండే సూక్షజీవులు మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచైనా మీరు డెస్క్ వద్ద తినే అలవాటు ఉంటె మానుకోండి.

ఆహారానికి అదనపు పదార్ధాలను కలుపుతూ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మసాలా లేదా ఆలివ్ నూనె ను ఎక్కువగా ఆహారంలో కలపడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి.

చాలామంది ఆలస్యంగా తింటూ ఉంటారు. అయితే దీనివల్ల మొదట్లో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. అంతేకాకుండా లేటుగా తినడం వల్ల ఒకేసారి ఎక్కువగా తినాల్సి వస్తోంది. దీంతో మీ జీవక్రియ నెమ్మది అయిపోతుంది. ఫలితంగా మీ శరీరంలో ఫ్యాట్ ఎక్కువయి పోతుంది.

చాలామంది సాండ్ విచ్ కోసం వైట్ బ్రెడ్ ఉపయోగిస్తుంటారు. వైట్ బ్రెడ్ లో ఎలాంటి ఫైబర్ ఉండదు. గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది రక్తపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుంది. అందువల్ల వీలైనంత వరకు వైట్ బ్రెడ్ కు దూరంగా ఉండండి. బ్రౌన్ బ్రెడ్ ను వాడండి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

సోడాలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. ఇందులో ఎలాంటి కేలరీలుండవు. అలాగే శరీరంలో ఫ్యాట్ ఏర్పడేందుకు కారణం అవుతుంది. మీరు బరువు పెరగడంతో పాటు ఇతర సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాకుండా మీ పళ్ళు కూడా దంత క్షయానికి గురవుతాయి. బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది. నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందువల్ల మీరు తినే సమయంలో సోడాకు దూరంగా ఉండండి.

మీరు రోజూ తినే ఆహారంలో కూరగాయాలతో తయారు చేసిన మీ భోజనాన్ని తీసుకుంటే మంచిది. దీంతో మీ శరీరానికి కావాల్సిన విటమిన్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే అధిక ఫైబర్ మిమ్మల్ని ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు తినడానికి ముందు ఎలాంటి చిరుతిళ్లు తినకూడదు.

మీరు ఫుడ్ ను ఎక్కువగా వేడి చేసి తింటున్నారా? అది కూడా మైక్రోవోవెన్స్ లో ఫ్లాస్టిక్ ట్రేలో పెట్టి వేడి చేసి తింటున్నట్లయితే మీరు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనివల్ల బిస్ ఫినాల్ అనే పదార్థం ఆహారాలు చెడిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ పదార్ధం కణాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే కాస్త సేఫ్ కంటెనైర్స్ ఉపయోగిస్తే బీపీఏకు దూరంగా ఉండండి.

తిన్న తర్వాత అలాగే కూర్చొని ఉండిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిన్న ఆహారం వెంటన జీర్ణం కావాలంటే తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయటం మంచిది. వాకింగ్ ద్వారా కేలరీలు తగ్గుతాయి. అలాకాకుండా కూర్చొని ఉంటే ఎనర్జీ మొత్తం కొవ్వుగా మారుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)