రూ.100 స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో వేరే వాళ్ళ భార్యను లీజుకి తీసేసుకోవచ్చు. ఇక్కడ బ్రోకర్లు నెలకి 2 లక్షల వరకూ సంపాదిస్తారు

గర్భాశయాన్ని అద్దెకిచ్చే మొదటిదశనుంచి ఇప్పుడు భారతీయ స్త్రీలు భార్యలను అద్దెకిచ్చే దశకి వచ్చారు! అవును, మీరు సరిగ్గానే చదివారు, భార్యను- అద్దెకి-ఇవ్వటం. పెళ్ళిలో అమ్ముడుపోవటం నుంచి, ఇప్పుడు భార్యలు దొరకని పెద్దింటి మగవారికి భార్యలుగా ఉండటాన్ని కోరబడతున్నారు, అదీ నెలలవారీ లేదా సంవత్సరాలవారీగా. స్త్రీల సాధికారత, మరియు సమానహక్కుల కోసం పోరాడుతున్న దేశంలో, స్త్రీలు నిజంగా లీజుకిస్తూ అమ్మబడుతున్నారు. ఇలాంటి అలవాట్లు మన సంస్కృతిలో అనేక సంవత్సరాలనుండి ఉన్నాయి. కానీ వాటికి వ్యతిరేకంగా ఈ నాటివరకు ఏ చర్య తీసుకోకపోవడం బాధాకరం. ఇలాంటి కొన్ని కేసులు కింద చూడండి.

ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల తర్వాత కూడా స్త్రీ శిశుభ్రూణహత్యలు ఇంకా ఆగలేదు. అందుకే మధ్యప్రదేశ్ లో లింగ నిష్పత్తి ప్రతిరోజూ మారుతూ వస్తోంది. దాని ప్రభావం మధ్యప్రదేశ్ లోని శివపురి ప్రాంతంలో ఎక్కువగా చూడవచ్చు. మనకున్న ఆధారాల ప్రకారం, దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని శివపురి జిల్లాలో పాటిస్తున్నారు. దానిప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వవచ్చు. నిజం! స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో, ఒక స్త్రీ యొక్క భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికం చేయటానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై సంతకం చేస్తారు.

ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం సమయం అయిపోయాక, ఆ తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది. ఇలాంటి చర్యలు అనేకసార్లు పోలీసుల ఎదుట కూడా జరిగాయి. కానీ స్త్రీలు తమంతట తాము నోరు విప్పనంతకాలం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోనంతకాలం ఎలా అలాంటి వాటిపై చర్యలు తీసుకోగలరు ? టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం, భరుచ్ లోని నేత్రాంగ్ తాలూకాలో 2006లో అట్టా ప్రజాపతి అనే వ్యక్తి తన భార్య లక్ష్మిని మెహ్సానాలోని ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దెకి పంపించివేసాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాలలో పిల్లలని కనలేని స్త్రీలను పేద కుటుంబాల వారు ఇలా డబ్బు కోసం వాడుకుంటున్నారు. నేత్రాంగ్, వలియా, దేడియాపద, సక్బరా, రాజ్ పిప్లా, జఘాదియా వంటి ప్రాంతాలలో వాసవ గిరిజన తెగకి చెందిన గిరిజనులు కూడా వచేతియాస్ అనబడే బనస్కంత, మెహ్సానా, అహ్మదాబాద్ వంటి జిల్లాల బ్రోకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 

పటేల్స్ మరియు ఠాకూర్ జాతికి చెందిన గిరిజన స్త్రీలను ఈ విధంగా వెలకట్టి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు. ఈ ప్రాంతంలో అనేకమంది మధ్యవర్తులు చిన్న గిరిజన యువతులను రూ 500 నుంచి రూ.60000 వరకూ వారి పేదరికం, డబ్బు అవసరాలను బట్టి ఇలా పంపిణీ చేయడానికి పనిచేస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బ్రోకర్ దాదాపు నెలకి 1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)