ఎప్పుడో ఒకసారి తాగితే పర్వాలేదు అనుకుంటున్నారా ? నెలలో ఒక్కసారి తాగినా షుగర్ బిపి గుండె జబ్బులు తప్పవంటున్నాయి తాజా పరిశోధనలు

నెలకి రెండు సార్లు శీతల పానీయాలను సిప్‌ చేసినా డయాబెటిస్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ఆహ్వానించినట్టేనని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. నెలకి రెండు సార్లు శీతలపానీయం తీసుకున్నా టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్క్‌ అధికమవుతుందని, ఒకే ఒక్కసారి ఈ డ్రింక్‌ తీసుకుంటే రక్తపోటు అధికమవుతుందని పరిశోధన బాంబు పేల్చింది. ఈ పానీయాలతో మధుమేహంతో పాటు అధిక కేలరీలు శరీరంలో పేరుకుని బరువు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.

నెలకి రెండు సార్లు పైగా శీతల పానీయాలను సేవించే వారిపై జరిపిన అథ్యయనాల ఆధారంగా దక్షిణాఫ్రికాలోని స్టెలెన్‌బాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయం నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిలోనూ చక్కెరతో కూడిన శీతలపానీయాల వినియోగం పెరుగుతోందని సర్వే రచయిత ప్రొఫెసర్‌ ఫడీల్‌ ఎసోప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పానీయాలతో మధుమేహం, అధిక రక్తపోటు ముప్పు ఎక్కువవుతోందని తమ విశ్లేషణల్లో వెల్లడైందని చెప్పారు.ఎండోక్రిన్‌ సొసైటీ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)