ప‌నిమ‌నుషుల‌ను సొంత మ‌నుషులుగా చూసుకునే త‌త్త్వం. కేవలం 6 గురి కోసం 600 మంది పని వాళ్ళు.. అంబానీ 27 అంత‌స్తుల భ‌వనం విశేషాలు

అంబానీ.. ఆస్తుల‌కు కెరాఫ్ అడ్ర‌స్.. ఇండియా మొత్తంలోని సంపాధ‌న‌లో 15 శాతానికి పైగా అత‌ని వ‌ద్దే ఉందంటే అతిశ‌యోక్తి కాదు.! త‌న ఆస్తుల‌కు త‌గ్గట్టే త‌న అంత‌స్తుండాల‌ని.. ముంబైలో 27 అంత‌స్తుల ఎంటిలియా భ‌వ‌నాన్ని నిర్మించాడు. ఇంతకు ముందు ముంబై వెళితే.. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడ‌డానికి ఎగ‌బ‌డుతున్న జ‌నాలు ఇప్పుడు అంబానీ గారి 27 అంత‌స్తుల భ‌వనం ముందు సెల్పీలు దిగుతున్నారు !! 
ఆ భ‌వ‌నం విశేషాలు:
1. భూకంపాన్ని త‌ట్టుకునేలా నిర్మాణం. ( రిక్ట‌ర్ స్కేల్ పై 8 పాయింట్స్ గా న‌మోదైన భూకంపాన్ని సైతం త‌ట్టుకుంటుంది)
2. మొద‌టి నాలుగు ఫ్లోర్స్ కేవ‌లం వారి ఖ‌రీదైన కార్ల పార్కింగ్ కొర‌కు మాత్ర‌మే ఉప‌యోగిస్తారు.!
3. పై అంత‌స్తులో హెలిప్యాడ్ ఉంది, ఏక‌కాలంలో మూడు హెడికాఫ్ట‌ర్లు ఇక్క‌డ ల్యాండ్ అవ్వొచ్చు.!
4. జిమ్, స్విమ్మింగ్ ఫూల్, బార్ అన్ని ఇందులోనే.!
5. అంబానీ ఎంటిలియా భ‌వ‌నానికి నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం ఓ సెప‌రేట్ విద్యుత్ స‌బ్ స్టేష‌న్ కూడా ఉంది.
ఓ ఫ్యామిలీ నివ‌సించ‌డానికి క‌ట్టిన భ‌వ‌నంలో ప్ర‌పంచంలోనే ఇదే అతి పెద్ద‌ది.
ఆ ఇంట్లో ప‌ని వాళ్లు – వాళ్ల జీతాలు:
టోట‌ల్ గా 600 మంది ప‌నివాళ్లు 24/7.. ఆ కుటుంబంలోని 6 గురికి సేవ‌లందిస్తారు.!
6000 నుండి 2,00,000 వ‌రకు జీతం తీసుకుంటున్నారు.
హెడ్ కుక్ – 2 ల‌క్ష‌లు.
కార్ డ్రైవ‌ర్ – 2 ల‌క్ష‌లు.
ప్ర‌తి ఉద్యోగికి- హెల్త్ ఇన్స్యూరెన్స్, PF లాంటి అన్ని ప్ర‌భుత్వ సౌక‌ర్యాలు.!
ఇక అంబానీ ఇంటి చుట్టూ Z సెక్యురిటీ ఉంటుంది- దీని ఖ‌ర్చు నెల‌కు 15 ల‌క్ష‌లు.!
పండ‌గ కానుక‌లు, బోన‌స్ లు అధ‌నం. వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటే ఆ ఖర్చు కూడా అంబానీయే చూసుకుంటున్నాడు. అన్నింటికి మించి ప‌నిమ‌నుషుల‌ను ప‌నిమ‌నుషులుగా కాకుండా, సొంత మ‌నుషులుగా చూసుకునే త‌త్త్వం.!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)