జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మంచి అదృష్టం కలుగుతుంది

మన తల రాతను మార్చే, అంటే మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది. ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వుంటే జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మంచి అదృష్టం కలుగుతుందని ఇక్కడప్రజలు నమ్ముతారు. అసలు ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఏముంది ? అనే విషయాల్ని మనం ఇప్పుడు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఒక సారి బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం నేనే. ఈ సృష్టికి అంతంకూడా నేనే అనే గర్వాన్ని కలిగి వుంటాడు. అప్పుడు పరమ శివుడు శివుడియొక్క ప్రతి రూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవునియొక్క 5 వ తలని ఖండించటంజరుగుతుంది. అంతేకాకుండా అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవునికి తన సృష్టినిర్మాణశక్తిని కోల్పోవాలని శపిస్తాడు.
తనతప్పు తెలుసుకున్న బ్రహ్మ దేవుడు పశ్చాత్తాపంతో శాప విముక్తికోసం ఈ ప్రాంతంలో పరమశివుడి యొక్క 12లింగాల్ని ప్రతిష్టించిప్రార్ధిస్తాడు. అందుకే ఈ వూరిని బ్రహ్మపురిఅని అంటారు. బ్రహ్మదేవుడియొక్క పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీపరమేశ్వరులు బ్రహ్మ దేవునికి కలిగిన శాప విమోచానానికి విముక్తుల్ని చేసి తిరిగి అతనికి సృష్టి నిర్మాణశక్తులను ఇవ్వటం జరుగుతుంది.
ఇక ఇక్కడ బ్రహ్మదేవునికి ప్రత్యేకమైన ఆలయం కూడా వుంది. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు తన తల రాతనే తిరిగిరాసుకున్నాడు అనే ప్రాంతంగా భావించటం జరుగుతుంది. అందుకే ఇక్కడికివచ్చి ఆ బ్రహ్మదేవుడిని 12 శివలింగాలని దర్శించిన వారికి ఫేట్ అనేది మారుతుంది అంటే దురదృష్టం అనేది తొలగిపోయి మంచి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. చాలా మంది ఎంతో ప్రత్యేకంగా తమజీవితంలో అనుకున్నది సాధించలేక పోయినప్పుడు, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఇక్కడికివచ్చి ఈ బ్రహ్మదేవుడిని దర్శించుకుని తమయొక్క కష్టాలను తొలగించుకుంటారు. బ్రహ్మదేవుడు సృష్టించిన 12 శివలింగాలుఅంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవసమాధికూడా వుంది.
ఇంతకి ఈ ఆలయం పేరెంటనే కదా మీ ప్రశ్న. ఈ ఆలయంపేరు బ్రహ్మపురీశ్వర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి సమీపంలో తిరుపత్తూర్ లో వుంది. ఇది హిందూఆలయం. ఇక్కడ భక్తులు బ్రహ్మయొక్క ఆశీర్వాదాలను పొందుటకు సందర్శిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మీ తల రాత బాలేదా బాధపడకండి మీ తల రాతను మార్చే దేవాలయం ఇది. మీకు గనక దేవుడిమీద నమ్మకం, విశ్వాసం కనకవుంటే ఈ ఆలయాన్ని సందర్శించండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)