గుడిలో ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తే అదృష్టం వరిస్తుంది

మానసిక ప్రశాంతంతకు నెలవు దేవాలయాలు. దేవాలయానికి వెళ్తే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనిపై శ్రద్ద కలుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ మననుంచి దూరం అవుతుంది. చేస్తున్న పనిపై శ్రద్ద పెరుగుతుంది. ప్రశాంతత కోరుకునేవారి కంటే.. అనుకున్న పనులు నెరవేరాలని చెప్పి గుడిచుట్టు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే, ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. గుడిలో 3,5,7 ఇలా బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేయడం మంచిదే. ఐతే, ఏ దేవుడికి ఏ రోజున ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం – సూర్యనారాయణ స్వామికి 18 ప్రదక్షణలు, నవగ్రహాలకు 18 ప్రదక్షణలు, నాగేంద్ర స్వామికి 18 ప్రదక్షణలు,సుబ్రహ్మణ్య స్వామికి 27 ప్రదక్షణలు చేస్తే మంచి జరుగుతుంది.
సోమవారం – శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షణలు, శ్రీరామ చంద్రునికి 20 ప్రదక్షణలు, శ్రీ కృష్ణుడికి 20 ప్రదక్షణలు చేయాలి.
మంగళవారం – సింధూర ఆంజనేయస్వామికి 21 ప్రదక్షణలు. శివాలయంలో 18 ప్రదక్షణలు, గణపతికి 27 ప్రదక్షణలు చేస్తే మంచిది.
బుధవారం – సరస్వతీ దేవికి 17 ప్రదక్షణలు చేయాలి.
గురువారం – శ్రీ సాయి దేవాలయంలో 16 ప్రదక్షణలు చేయాలి.
శుక్రవారం – దుర్గాదేవికి 20 ప్రదక్షణలు చేయాలి.
శనివారం – వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షణలు చేయాలి. ఈ విధంగా ఇష్ట దైవానికి ఇష్టమైన రోజు ప్రదక్షిణలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)