అద్భుతమైన సూర్య దేవాలయం. కింద భాగంలో కోణాకృతి అదే పైభాగం నుంచి చూస్తే గుండ్రంగా కనిపించడం విశేషం

ఆది దేవుడిగా కొలిచే సూర్య భగవానుడి దేవాలయం అన్ని దేవాలయాలలో కన్నా చాలా అరుదైనదని చెప్పాలి. కాగా సూర్య భగవానుడి దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోణార్క్ సూర్యదేవాలయం. ఇక ఆంధ్రప్రదేశ్ లోని అరసవెల్లి సూర్య దేవాలయం కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినదే.. 
అయితే ఈ రెండు సూర్య దేవయాలయాలే కాకుండా గుజరాత్ లోని పుష్పవతి నది తీరాన వెలసిన మొఢెరా సూర్య దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.. ఎంతో చరిత్ర కలిగిన ఈ సూర్య దేవాలయం స్కంద, బ్రహ్మ పురాణాల్లో కూడా ప్రస్తావనకు నోచుకున్నది ఈ అరుదైన సూర్య దేవాలయం.. ఇప్పుడు మనం ఈ సూర్య దేవాలయం విశేషాలను.. విశిష్టతను తెలుసుకుందాం... !!
అరుదైన ఆలయం చరిత్ర: అహమ్మదాబాద్ నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న పుష్పవతి నది ఒడ్డున సూర్య దేవాలయం ఉన్నది. క్రీ.పూ 1022, 1063 లో భీందేవ్ సోలంకి చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. కాగా క్రీ.పూ. 1025, 1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను విదేశీ ఆక్రమదారుడైన మహమ్మద్ గజనీ తన అధీనంలోకి తీసుకున్నట్లు ఈ దేవాలయంలోని గర్భ గుడి లో ఒక గోడ పై నిర్మించబడి ఉన్నది. గజనీ ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. ఈ నేపద్యంలో సోలంకి రాజధాని "అహిల్ వాడ్ పాటన్" కూడా తన గొప్పదనాన్ని, వైభవాన్ని కోల్పోయింది.
సోలంకి తమ పూర్వవైభవాన్ని కాపాడుకొనేందుకు సోలంకి కుటుంబీకులు సూర్య వంశ రాజులు, వ్యాపారాలను కలుపుకొని ఓ జట్టుగా ఏర్పడి తమ వంశం కులదేవత సూర్యుడు ఆలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. మోఢేరా సూర్యదేవుడు ఆలయం.. అలా నిర్మింపబడింది. ఎంతో అందమైన శిల్పా కళా సంపదతో రమణీయంగా దర్శనం ఇచ్చే ఈ సూర్య ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఓ ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. ఈ ఆలయం సున్నం ఏ మాత్రం వినియోగించకుండా నిర్మింపబడింది. 
ఇరానీ శిల్పకళా శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్ దేవ్ నిర్మించారు. మొదటి భాగం గర్భగుడి, రెండవది సభా మండపం..

మందిరంలోని సభామండపంలో మొత్తం 52 స్థంబాలున్నాయి. ఈ స్థంభాలపై రామాయణ, మహాభారత ప్రధాన విశేషాలను చెక్కారు. స్థంబాల కింద భాగంలో చూస్తే అష్ట కోణాక్రంలోనూ... అదే పైభాగం నుంచి చూస్తే గుండ్రంగా కనిపించడం విశేషం.. 
సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్య కిరణం ఆలయ గర్భ గుడిలోకి ప్రసరించేలా ఆలయం నిర్మింపబడింది. సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని సూర్య కుండ్ లేదా రామ మడుగు అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని అల్లా వుద్దీన్ ఖిల్జీ తన అధీనంలోకి తెచ్చుకొనే సమయంలో సూర్య మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విగ్రహాలను కూడా పాడు చేశాడు.
స్థల ప్రాశస్త్యం: మొఢెరా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ధర్మరణ్య అని పిలిచేవారని.. స్కాందపురాణం, మరియు బ్రహ్మ పురాణంలో ఉన్నది. శ్రీరాముడు రావణున్ని వధించిన తర్వాత బ్రహ్మ హత్యా పాతకం నుంచి తనకు విముక్తి లభించేలా ప్రాయఃచిత్తం చేసుకొనేందుకు తగిన.. పవిత్రమైన స్థలం చెప్పమని తన గురువైన వశిష్టుడిని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు వశిష్టుడు ధర్మరణ్య వెళ్ళమని శ్రీరాముడికి చెప్పాడట.. అప్పటి ధర్మరణ్యనే ఇప్పటి మోడేరా.
ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలంటే.. అహ్మదాబాద్ నుంచి 102 కి.మీ దూరంలో మోఢేరా ఉన్నది.. ముందుగా అహ్మదాబాద్ కు చేరుకొని అక్కడ నుంచి ఈ దేవాలయం వెళ్లడానికి బస్సు, టాక్సీలు అందుబాటులో ఉన్నది. అహ్మదాబాద్ వరకూ అన్నీ ప్రాంతాల నుంచి రైలు మార్గం ఉన్నది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)