ఇంట్లోని వస్తువులతోనే పులిపిరులను తొందరగా తరిమేయండి

పులిపిర్లు మన చేతులు, కాళ్లు, ముఖంపైన ఎక్కువగా కనబడతాయి. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమస్ పాపిలోమా వైరస్). వీటిని గోళ్లతో గిల్లకూడదు. మనకు అందుబాటులో ఉన్న ఇంట్లోని వస్తువులతోనే పులిపిరులను తగ్గించుకోవచ్చు... అన్నిటికంటే ముఖ్యంగా శరీరాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచాలి. ఇప్పుడు చిట్కాలేంటో చూద్దాం..
అరటి తొక్కను చిన్న ముక్కగా కట్ చేసి పులిరిపై ఉంచాలి. దానిపై ప్లాస్టర్ అంటిస్తే పడిపోకుండా ఉంటుంది. ఇలా రాత్రంతా ఉంచి ఉదయాన్నే తీసివేయాలి. ఇలా పులిపిరి ఊడిపోయేంత వరకు చేస్తుండాలి. 
వెల్లుల్లి రేకలను కచ్చా పచ్చాగా దంచి పులిపిరులపై రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణం వల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాల పాటు చేయాలి. 
ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి రాళ్ల ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని 30 రోజుల పాటు క్రమం తప్పకుండా పులిపిరుల మీద అప్లై చేస్తే ఊడిపోతాయి.
పులిపిరులకు ఆముదం కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతో గానీ లేది మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి.
కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరి కాయలపైన రాయాలి. అయితే ఇది రాసుకునేటప్పుడు సున్నం చుట్టు పక్కల ఉన్న చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.
పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైంది. విటమిన్-ఎ, విటమిన్-సి లను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేపనూనె, క్యారట్‌లలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. 

ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కావునా రెండు నెలల పాటు ఉసిరిని మెత్తగా నూరి ఆ గుజ్జును పులిపిరుల మీద అప్లై చేస్తే రాలిపోతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)